5 రోజులలో తన భర్త చనిపోతాడని తెలిసి ఒక భార్య చేసిన త్యాగం!!

భర్త ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నాడని తెలుసుకున్న భార్య తన బిడ్డను భర్త చేతుల్లో పెట్టాలని, తన భర్త చివరి కోరికను తీర్చాలని 5 రోజుల ముందుగానే  బిడ్డకు జన్మను ఇచ్చింది. తల్లి అంటే నిస్వార్థ పరురాలను మరోసారి నిరూపించింది. ఆ తల్లి గొప్పదనం, ఆ భర్త జీవితం గురించి తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకుంటారు.

వారి జీవితాన్ని మార్చేసిన సంఘటన

మార్క్, డయానా దంపతులు తమ జీవితంలో మరో కొత్త వ్యక్తి తమ బిడ్డ రూపంలో రాబోతుందని ఎంతో సంతోషపడ్డారు.  అయితే ఆ ఆనందం కొన్ని క్షణాలే ఉండబోతున్నాయని తెలిసింది. తమ బిడ్డ ఇంకో 6 నెలలలో ఈ ప్రపంచంలోకి రానుందనగా మార్క్ ప్రాణాంతక ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని తెలిసింది. అతన్ని వెంటనే ఎమర్జన్సీ రూమ్ లో పెట్టి థెరపీ మొదలుపెట్టారు వైద్యులు.

భర్త చివరి కోరిక ఇదే

తన బిడ్డను తన చేతుల్లోకి తీసుకోవాలని, బిడ్డను కళ్లారా చూడాలనేది మార్క్ చివరి కోరిక. తల్లి కడుపులో ఉన్న బిడ్డ లంగ్స్ అభివృద్ధి చెందడం మొదలయ్యింది. ఐతే తన భర్త చనిపోకముందే బిడ్డకు జన్మను ఇవ్వాలని ఆ తల్లి వైద్యులను కోరుకుంది. వైద్యులు తన ప్రసవం గురించి చెప్పిన రెండు వారాల కంటే ముందుగానే బిడ్డకు జన్మను ఇచ్చింది. ఎందుకంటే తన భర్త ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న చివరి క్షణాలు ఆమెను కలచివేశాయి.  అందుకే భర్త చనిపోయే 5 రోజుల ముందుగానే బిడ్డకు జన్మను ఇచ్చింది.

45 నిముషాలు తండ్రి చేతుల్లో

తన భర్తకు ఊపిరి తీసుకోవడానికి, కళ్ళు తెరచి చూడటానికి కూడా శక్తి లేదు. కోమాకు దగ్గరగా ఉన్నాడు. చీకటి కళ్ళముందు కమ్ముకుంటోంది. బిడ్డకు జన్మను ఇవ్వగానే తన భర్త దగ్గరకు బిడ్డను తీసుకెళ్లి, ఏవండీ మనకు కూతురు పుట్టింది, ప్లీజ్ కళ్ళు తెరచి చూడండి అంటూ భర్త చేతులపై కూతురిని పడుకోబెట్టింది ఆ తల్లి. అలా 45 నిముషాల పాటు, శ్వాస తీసుకుంటున్న చివరి నిముషం వరకు పాపను తండ్రి దగ్గరే ఉంచింది.

కన్నీరు పెట్టుకున్న వైద్యులు

ఒకవైపు బిడ్డకు ప్రాణం పోసిన వైద్యులు, మరోవైపు తండ్రి ప్రాణాలను కాపాడలేకపోతున్నామనే బాధ. అప్పుడే పుట్టిన తన కూతురిని భర్త చేతుల్లో పెట్టి మన బిడ్డను చూడండి అంటూ మదనపడుతుంటే ఆ హాస్పిటల్ వైద్యులు తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. ఒక గొప్ప తండ్రిని నీ కూతురు మిస్ అవుతోంది కానీ అంతకంటే గొప్ప తల్లి నువ్వు నీ బిడ్డను బాగా చూసుకోవాలని ఓదార్చారు.

హృదయాన్ని కలచివేస్తున్న ఈ సంఘటన ప్రపంచమంతటా వైరల్ అయ్యింది. నిస్వార్థమైన తల్లి అంటూ ఆ తల్లి గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి. 

ఎవరైనా ఎత్తుకుపోతారనేమో!! ఈ బిడ్డ సంచితో పాటు పుట్టాడు: ఆశ్చర్యపోతున్న వైద్యులు

Leave a Reply

%d bloggers like this: