చిన్నపిల్లలో జలుబు, దగ్గు, జ్వరం తగ్గించడానికి సహజ చిట్కాలు మరియు ఆహారాలు

చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఒక తల్లిగా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారికి ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వారికి దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే,

తల్లిపాలు

తల్లిపాలలో ఉండే పోషకాల వల్ల బేబీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు వంటి రోగాలు దరి చేరవు. అంతేకాక,  పిల్లలలో నీటి శాతం పెరిగి ఆనందంగా ఉంటారు.

సెలైన్ డ్రాప్స్

పిల్లలకు త్వరగా వచ్చే జబ్బు జలుబు. దీంతో వారి ముక్కు శ్వాసకు అనుకూలంగా ఉండదు కాబట్టి సెలైన్ డ్రాప్స్‌ను రోజులో 3 సార్లు ముక్కులో వేయడం వల్ల శ్వాస బాగా అంది జలుబు దూరమౌతుంది.

లిక్విడ్స్

పిల్లలకు ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలో నీటి శాతం పెరిగి వారికి వచ్చిన జలుబు వెంటనే తగ్గిపోతుంది.

సూప్

వేడిగా ఉన్న సూప్ తాగించడం మంచిది. ఇలా చేయడం వల్ల వేడి గొంతు ద్వారా వెళ్ళి జలుబు నుండి ఉపశమనం కలిస్తుంది.

తేనె 

జలుబు చేసిన వారికి రెండు తెనె చుక్కలు రోజులో 3 సార్లు ఇవ్వడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. సిరప్ కన్నా తేనే బాగా పని చేస్తుంది.

ఆయిల్ మసాజ్

బాడీకి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల శరీరం మీద ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది కాబట్టి ఆయిల్‌తో బేబి శరీరానికి మసాజ్ చేయడం మంచిది.

తల

చిన్న పిల్లలకు శ్వాస బాగా అందడానికి తలను వారికి అనుకూలంగా పెట్టండి తద్వారా వారికి శ్వాస బాగా అందుతుంది.

పాల ఉత్పత్తులు

బయట తయారు చేసిన పాల ఉత్పత్తులు ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలకు ఇవ్వకండి ఇలా ఇవ్వడం ద్వారా వారికి జలుబు, దగ్గు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

ఉల్లి జ్యూస్

ఉల్లిపాయతో చేసిన జ్యూస్ ఇవ్వడం ద్వారా జలుబును, దగ్గును తొందరగా పోగొట్టవచ్చు కాబట్టి కొంచెం కష్టమైనా ఉల్లి జ్యూస్ ఇవ్వడానికి ప్రయత్నించండి.

చల్లని బట్టలు

చల్లని బట్టలు వేయడం వల్ల పిల్లల శరీరంలోని వేడిని తగ్గించవచ్చు. తద్వారా జ్వరం తగ్గుముఖం పడుతుంది.

ఇంకా చాలా సహజ చిట్కాలు ఉన్నాయి….రెండవ భాగం రేపు చూడండి

Leave a Reply

%d bloggers like this: