డయాబెటిస్ ఉన్నవారు ప్రగ్నెన్సీ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వలన మెటబాలిజం కంట్రోల్ లో ఉండకపోవడ, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి లక్షణాలనే డయాబెటిస్ అంటారు. దీనినే మధుమేహం లేదా డయాబెటిస్ మెల్లిటస్ అని కూడా పిలుస్తారు. అయితే మహిళలలో ముఖ్యంగా ఎక్కువ వయసు ఉన్నప్పుడు గర్భం దాల్చినప్పుడు డయాబెటిస్ సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. కొంతమందిలో ఈ సమస్య ప్రగ్నెన్సీ టైంలో నెలలు గడుస్తున్న కొద్దీ కనిపిస్తుంది, అలాగే ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. అయితే ప్రగ్నెన్సీతో  ఉన్నప్పుడు డయాబెటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో వివరంగా తెలుసుకుందాం..

గర్భంతో ఉన్నప్పుడు డయాబెటిస్ ఎలా వస్తుంది?

ఒకప్పుడు గర్భిణీ మహిళలలో డయాబెటిస్ సమస్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య మునుపటికంటే ఎక్కువగా ఉంది. గర్భంతో ఉన్నప్పుడు డయాబెటిస్ ఎలా వస్తుంది అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. సాధారణంగా మాయ నుండి బిడ్డకు హార్మోన్లు అందడం వలన బిడ్డ ఎదుగుల జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే కొన్నిసార్లు తల్లి శరీరంలో ఉండే హార్మోన్లు ఇన్సులిన్ ను అడ్డుకోవడం జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ ఇన్సులిన్ ను తల్లి వినియోగించుకోకపోవడం వలన డయాబెటిస్ కు దారితీస్తుంది.

డయాబెటిస్ రాకుండా ఏం చేయాలి?

సాధారణంగా తీసుకునే ఆహారంపైనే డయాబెటిస్ కు కారణమవుతుంది. అంటే జంక్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామాలు చేయకపోవడం, సరైన నిద్రలేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండటం, బరువు పెరగడం వలన డయాబెటిస్ కు కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రగ్నెన్సీ సమయంలో డయాబెటిస్ ఉండటం వలన నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనివ్వడం, అలాగే డయాబెటిస్ ను గర్భిణీ మహిళలలో త్వరగా గుర్తించకపోతే పుట్టే బిడ్డల ఆకారంలో మార్పు కలగడం జరుగుతుంది. ఇలా పుట్టిన బిడ్డలకు త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే గుండె సంబంధిత మరియు శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మొదటి మూడు నెలలలోపే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడి బిడ్డ ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారు.

తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తలు

పౌష్టిక ఆహారం ఎక్కువగా తీసుకోవాలి పండ్లు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటూనే గింజల ఆహారాన్ని బాగా తినాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, కొంత దూరం నడుస్తూ ఉండటం, బరువైన పనులు సులభంగా ఉండే ఇంటి పనులు చేసుకోవడం వలన రక్తంలో చక్కర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. గర్భిణీగా ఉన్నప్పుడు ఒత్తిడి పడకూడదు. ఒత్తిడికి గురి కావడం వలన రక్తపోటుకు కారణమవుతుంది. ఈ సమయంలో వ్యాయామాలు చేయడం వలన డయాబెటిస్ నుండి బయటపడవచ్చు అని చెప్పడానికే కాదు ప్రసవం సమయంలో వెన్నునొప్పి సమస్య ఉంటుంది. ఆ ఇబ్బందిని కూడా అప్పుడు తట్టుకోగల శక్తి ఉంటుంది. అలాగే మంచి విశ్రాంతి అవసరం మరియు తక్కువ మొత్తంలో అయినా సరే ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి.

ఇంకా ఈ సమస్యపై మీకు ఏమైనా అనుమానాలు ఉంటే COMMENT చేయవచ్చు. అలాగే ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే LIKE & SHARE చేయగలరు

Leave a Reply

%d bloggers like this: