పిల్లలకు సాలిడ్ ఫుడ్ మొదలుపెట్టడానికి 3 అద్భుతమైన ఆహారాలు : తయారుచేసే విధానం

బిడ్డ ఎదిగే క్రమంలో పాల నుండి ఆహారానికి మార్పు చెందే దశ అత్యంత కీలకమైనది. తల్లికి ఇదో పరీక్ష లాంటిది ఎందుకంటే, ఎటువంటి ఆహారం తింటే బాబు ఉల్లాసంగా ఉంటాడు, జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది అనే ఆలోచనలు చేస్తారు. దీంతో మీరు మీకు తెలైయకుండానే ఎమోషనల్‌గా ఉద్వేగానికి గురవుతారు. అయితే, ఎప్పుడు ఘన ఆహారం తినిపించాలి ఎలాంటి ఆహారం తినిపించాలి అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఎప్పుడు తినిపించాలి

సాధారణంగా చిన్నపిల్లలు 6 నెలలు నిండిన తర్వాత తినడం మొదలుపెట్టే అవకాశం ఉంది. వారికి అప్పుడప్పుడే దంతాలు రావడం మొదలుపెడతాయి, మీ చేతిలో ఉన్నటువంటి ఆహారాన్ని గుంజుకొనే ప్రయత్నం చేఅస్తారు, ఆకలి అయినప్పుడు గట్టిగా ఏడుస్తారు. ఇలాంటి సంకేతాల ద్వారా మనం  వారికి ఫీడింగ్ స్టార్ట్ చేయవచ్చు.

ఎప్పుడు మొదలుపెట్టకూడదంటే

ఒక్కోసారి బేబీ సాలిడ్ ఆహారాన్ని తినేంత పరిపక్వత చెంది ఉండదు. దానిని ఎలా తెలుసుకోవాలంటే, మీ పాప/బాబు ఎక్కువగా తినలేకపోవడం, ఎక్కువగా పాలను అడుగుతుండటం, నిద్రలో ఉలిక్కిపడటం లేదా ఎక్కువసేపు మెలుకువతో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి ఘన ఆహారం మొదలుపెట్టకపోవడం మంచిది.

కొన్ని ఆహార పధార్థాలు తినిపించడం ద్వారా మీ బాబుకు జీర్ణం బాగా అవ్వడమే కాక ఇష్టంతో కూడా తింటారు. అవేంటంటే,

పళ్ళు-కూరలు

పిల్లలకు నాచురల్ ఫుడ్ ఇవ్వడం మంచిది. బాగా ఉడకబెట్టిన ఆపిల్, స్వీట్ పొటాటో, కేరెట్, అవకాడో వంటి పళ్ళు ఇవ్వాలి. కొంత నీటికి కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసి ఇవ్వవచ్చు. అయితే ఉప్పును రోజుకు 2 గ్రాముల కన్నా మించకుండా చూసుకోవాలి.

ఉడకబెట్టిన సెమోలినా

బాగా ఉడకబెట్టిన సెమోలినాకు(గోధుమ పిండి) కొంచెం ఉప్పు, చక్కెర కలిపితే పిల్లలు అమితంగా తినే అవకాశం ఉంది. దీనికి కొంచెం నెయ్యి కలిపినా మంచిది. అయితే మసాలాను ఎట్టిపరిస్థితుల్లోనూ జోడించకండి.

అన్నం

మన దైనందిక జీవితంలో అన్నం చిన్నప్పటి నుండే తెలియని ముద్ర వేసింది. మనం తినే ప్రతి పూటలోనూ అన్నాన్ని జత చేస్తాము. చిన్న పిల్లలకు కుడా బాగా ఉడికిన అన్నాన్ని తినిపించడం వల్ల బాగా తింటారు. అన్నానికి కొంచెం రసం లేదా పెరుగు కలిపి పెడితే ఎక్కువగా తినే అవకాశం ఉంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే  LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మొదటి 6 నెలలలో పసిపిల్లలలో మానసిక మార్పులు ఎలా జరుగుతాయి? తెలుసుకోవడం చాలా అవసరం

Leave a Reply

%d bloggers like this: