పిల్లలను అంటు వ్యాధుల నుండి ఎలా కాపాడాలి? ఎటువంటి ఆహారాలు ఇవ్వాలి..!

పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వారి శరీరాన్ని వ్యాధులు త్వరగా అంటుకుంటూ ఉంటాయి. వైరస్, ఫంగస్, బాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ వలన వచ్చే వ్యాధులనే అంటు వ్యాధులు అని అంటారు. పిల్లలలో వచ్చే అంటు వ్యాధులు ఏవి? ఆ వ్యాధులు రాకుండా పిల్లలను ఎలా కాపాడాలో తెలుసుకుందాం..

జలుబు, దగ్గు

జలుబు లేదా దగ్గు ఉన్న పిల్లలు తుమ్మినా, దగ్గినప్పుడు  పిల్లలు పక్కనే ఉండటం వలన ఆ వైరస్ వీరిలోకి చేరి వెంటనే పిల్లలకు వ్యాపిస్తుంది. అందుకే పిల్లలకు జలుబు, దగ్గు రాకుండా ప్రతి రోజూ ఒకటి లేదా రెండు తులసి ఆకులను తినిపించడం చేయాలి.

చికెన్ ఫాక్స్.. అమ్మవారు

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న గర్భిణీలలో, పిల్లలలో ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. పిల్లల శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నోటిలో తెల్లని మచ్చలు, గొంతులో నొప్పిగా ఉండటం, ఎప్పుడు ముక్కునుండి నీరు కారుతూ ఉండటం, దగ్గుతూ ఉన్నట్లుగా ఉంటే అమ్మవారుగా గుర్తించాలి.  వైరస్ ప్రభావం కారణంగా వచ్చే ఈ వ్యాధి వలన శరీరంపై మొటిమల సైజులో దద్దుర్లుగా ఉంటాయి. ఈ ప్రభావం ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

గవద బిళ్ళలు

ఉమ్మి ద్వారా ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా 2 నుండి 12 సంవత్సరాల పిల్లలలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ఒకసారి గవద బిళ్లలు వస్తే మళ్ళీ జీవితంలో రావు. చెవుల కింద మరియు ముందు భాగంలో నొప్పితో పాటు వాపు కలిగి ఉంటాయి. 15 నెలల వయస్సులోనే పిల్లలకు ఈ టీకాలు ఇచ్చేవిధంగా చూసుకోవాలి. తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి ఈ వ్యాధి లక్షణాలు.

డిప్తీరియా

జలుబు, దగ్గు, జ్వరం ఉండి నీరసంగా ఉండటం, దగ్గినప్పుడు గొంతు నొప్పిగా ఉండటం, గొంతు కింద గడ్డలు కట్టడం ఈ వ్యాధి లక్షణాలు. గాలి తుంపర్ల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఒకటిన్నర సంవత్సరాలున్నప్పుడు, మూడు సంవత్సరాల వయస్సున్నప్పుడు డిపిటి మరియు డిటి అనే రెండు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం వలన ఈ వ్యాధి సోకదు.

తామర

మెడపై, తొడలు, చేతి గజ్జలలో పగుళ్లు, దద్దుర్లుగా ఏర్పడి ఎర్రగా ఉండి చర్మంపై మంటను కలిగిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి రక్తం కూడా కారుతుంటుంది కాబట్టి దుస్తులు బాగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా స్నానం చేయించడం చేయాలి.

ఇటువంటి అంటు వ్యాధులు పిల్లలను సోకకుండా ఉండాలంటే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వారికి ఉపయోగించే సబ్బులు, టవల్స్ ఇతరులు వాడకపోవడం, తాజా ఆహారం ఇవ్వడం చేయాలి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

బ్రెయిన్ ఫుడ్స్ : పిల్లల బ్రెయిన్ పవర్ పెంచే 10 అద్భుతమైన ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: