పిల్లలు వద్దనకుండా తినే లంచ్ బాక్స్ ఫుడ్స్ : ఆరోగ్యం – ఆనందం

ప్రతి మహిళ కూడా రేపటికి ఏమి వండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో పిల్లలు ఉంటే ఆ ఇల్లాలు లంచ్ గురించి మరింత ఆలోచిస్తుంది.  ఏ వంట చేస్తే వారు ఆనందంగా తింటారు. ఎలాంటి వంట చేస్తే వారి బాక్స్ వెనక్కి రాదు వంటి ఆలోచనలు అమ్మల మెదల్లలో సుడులు తిరుగుతూ ఉంటాయి. మీరు తొందరగా చేయగలిగే, మరియూ మీ పిల్లలు కచ్చితంగా తినే వంటలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే,

కర్రీ ఎగ్ శాండ్‌విచ్

కావలసినవి: ఉడకబెట్టీ కట్ చేసిన ఎగ్, కర్రీ పేస్ట్, మయొన్నైస్ పేస్ట్, టమోటో గుజ్జు, దోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ ముక్క.

తయారి విధానం: బ్రెడ్ ముక్కను కొంచెం వేడి చేసి కర్రి పేస్ట్‌ను, మయోన్నైస్ పేస్ట్‌ను వేయాలి. చివర్లో ఆనియన్ ముక్కలు, దోస ముక్కలు వేయాలి.

చికెన్ వ్రాప్స్

కావలసినవి: చికెన్ ముక్కలు, చిల్లి పొడి, వెల్లుల్లి, నూనె, రోటి, నిమ్మ రసం.

తయారి విధానం: చికెన్‌కు మిర్చి పొడి, నిమ్మరసం రాసి, వెల్లుల్లిని చల్లి నూనెలో వేయించాలి. దీన్ని వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత రోటిలో వేసి చుట్టుకొని తినాలి.

క్యారెట్ శాండ్‌విచ్

కావలసినవి: బ్రెడ్ ముక్కలు, క్యారెట్, ఎండు ద్రాక్ష, వెనెగర్, నూనె.

తయారి విధానం: క్యారెట్, ఎండుద్రాక్ష, వెనెగర్, నూనెలను బాగా కలిపి కొంచెం మింట్ యాడ్ చేయాలి. ఆ తర్వాత బ్రెడ్ ముక్కల మధ్య ఈ మిశ్రమాన్ని కలిపి కొంచెం వేడి చేసి తినాలి.

ఫిష్ ఫింగర్స్

కావలసినవి: ఫిష్ ముక్కలు, బటాణి, చిల్లి, లెమన్, మిరియాల పొడి, ఎగ్, బ్రెడ్, పుదీనా.

తయారి విధానం: కొంచెం శెనగపిండికి మిరపపొడి, లెమన్ యాడ్ చేసి తగినన్ని నీళ్ళు వేసి ముద్దలా చేయాలి. మరో బౌల్లో చేప ముక్కలను సిద్ధంగా పెట్టుకోవాలి. ఫిష్ ముక్కలను పిండిలో అద్ది ఎగ్ రాసి పాన్ మీద వేడి చేయాలి. వీటీకి పైన బటానీ పుదీనా వేసి కొంచేం సేపు అయ్యాక తినాలి.

లెమన్ చికెన్

కావలసినవి: చికెన్ ముక్కలు, లెమన్, పుదీనా ఆకులు, హనీ.

తయారి విధానం: చికెన్ ముక్కలకు కొంచెం ఉప్పు, పెప్పెర్ పొడీ పూసి 5 నిముషాల పాటు గ్రిల్ చేయాలి. ఆ తర్వాత నిమ్మరసాన్ని చికెన్ మీద వేసి హనీ, పుదీనా ఆకుల్ని చికెన్ మీద వేసి మరో 10 నిముషాల పాటు గ్రిల్ చేసి తినాలి.

ఫ్రూట్ స్టీక్స్

కావలసినవి: మీ పిల్లలు బాగా తినే పళ్ళు. ద్రాక్ష, బొప్పాయి, మామిడి, అరటి వంటివి. సుగర్, లెమన్.

తయారి విధానం: ముందుగా సుగర్‌ను లెమన్‌తో కలిపి చక్కెర కరెగేవరకు చేయాలి. ఏదైన వాడి అయిన స్టిక్ తీసుకొని దానికి పళ్ళను గుచ్చాలి. ఆ తర్వాత వాటిని 45 నిముషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత మీకు కావల్సిన ఫ్రూట్ స్టిక్స్ సిద్ధమైనట్లే.

బ్రొకోలీ చికెన్ సలాడ్

కావలసినవి : బ్రకోలి హెడ్స్, ఉల్లిపాయలు, నూనె, చికెన్ బ్రెస్ట్, సాస్, రెడ్ చిల్లీస్, వెల్లుల్లి

తయారి విధానం:  బ్రకోలిని తగినంత వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, వెల్లుల్లి, చిల్లిలకు తగినంత నూనె వేసి వేయించాలి. కొంతసేపు తర్వాత చికెన్ ముక్కలను, బ్రకోలిని వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత బ్రకోలి చికెన్ సలాడ్‌ను ఆరగించవచ్చు.

మష్రూమ్ టోస్ట్

కావలసినవి: బ్రెడ్, కాసింత వెన్న, ఆయిల్, కొన్ని పుట్టగోగులు, పాలు, ఆవాలు.

తయారి విధానం: బ్రెడ్‌కు కొంత వెన్న జోడించి పాన్ మీద కాల్చాలి. పుట్టగొడుగులను మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఆ తర్వాత చెంచా పాలలో ఆవాలు వేయించి ఆ మిశ్రమాన్ని బ్రెడ్ మీద వేసుకొని తినాలి.

Leave a Reply

%d bloggers like this: