పిల్లలు సంపూర్ణ ఎదుగుదల కోసం 3 ఉత్తమమైన ఆహారాలు

తమ పిల్లలు తమకళ్ల ముందు ఎదుగుతూ ఉంటే తల్లితండ్రులకు ఉండే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అయితే కొందరు పిల్లలలో ఈ ఎదుగుదల అనే లోపించడం వలన అలాగే ఉండిపోవడం, నీరసంగా ఉండటం, ఇతర పిల్లలతో పోల్చితే చురుకుగా ఉండలేకపోవడం చేస్తుంటారు. పిల్లల సంపూర్ణ ఎదుగుదల కోసం  తీసుకోవాల్సిన ఆ ఆహారం ఏంటో సింపుల్ గా తెలుసుకుందాం.

1.రాగి జావ

పిల్లల ఎదుగుదల కోసం బాగా ఉపయోగపడే ఆహారం రాగి జావ. రాగి జావను సింపుల్ గా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

2 స్పూన్ల రాగి పిండి, ఒక కప్పు నీరు, రెండు కప్పుల పాలు, రెండు స్పూన్ల పంచదార, రెండు స్పూన్ల బాదం పొడి,శొంఠి పొడి మరియు యాలకుల పొడి అర స్పూన్, ఒక స్పూన్ నెయ్యి, చిటికెడు కుంకుమ పువ్వు

ఎలా తయారుచేసుకోవాలి?

ఒక బౌల్ తీసుకుని అందులో నెయ్యి రాగి పిండి వేసి వేడిచేసుకోవాలి. రెండు నిముషాల తరవాత నీళ్లు పోసి ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. కొద్దిగా చిక్కగా మారిన తరవాత అందులో పాలు వేసి ఉండలు కట్టకుండా తిప్పాలి. మళ్ళీ కొద్దిసేపు బాగా ఉడికించి ఆ తరవాత బాదం పొడి, శొంఠి, యాలకుల పొడి మరియు చక్కెర వేసి మిక్స్ చేసి ఉడికించాలి. చిక్కగా ఉన్నప్పుడు దించుకుని చల్లారిన తర్వాత వడగట్టి పిల్లలకు ఇస్తే వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే రాగిముద్దను ఎలా తయారు చేసుకోవాలి, రాగిముద్ద వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా ఇక్కడ తెలుసుకోండి..

2.బంగాళాదుంప గుజ్జు

పిల్లల ఎదుగుదల కోసం మరియు బరువు పెరగడానికి బంగాళాదుంప గుజ్జు బాగా ఉపయోగపడుతుంది. బంగాళా దుంప గుజ్జు ఎలా తయారుచేసుకోవాలంటే..

కావలసిన పదార్థాలు

బంగాళాదుంప లేదా స్వీట్ పొటాటో, చిటికెడు వాము మరియు అర స్పూన్ నెయ్యి.

తయారీ విధానం

ముందుగా బంగాళాదుంపపై ఉండే తొక్కను తీసివేయాలి. లేదా బంగాళాదుంపలను ఉడికించి పై తొక్కలను తీసివేయాలి. బాగా ఉడికిన తర్వాత గుజ్జుగా ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో చిటికెడు వాము మరియు నెయ్యి కలిపి బాగా మిక్స్ చేయాలి. దీనిని బ్రేక్ ఫాస్ట్ గా లేదా లంచ్ గా తీసుకోవచ్చు. అలాగే అన్నంతో కలిపి కిచిడీలాగా చేసుకుని సేవించవచ్చు.

పిల్లల వయస్సుకు తగ్గట్లుగా ఎలా ఇవ్వాలి?

6 నెలల పిల్లలకు – 1 టీ స్పూన్ మోతాదులో వారానికి 2 సార్లు

7 నెలల పిల్లలకు – 1 టేబుల్ స్పూన్ వారానికి 2 లేదా 3 సార్లు

8 నుండి 10 నెలల పిల్లలకు – 2 టేబుల్ స్పూన్లు వారానికి 2 లేదా 3 సార్లు

10 నుండి 12 నెలల పిల్లలకు -3 నుండి 4 టేబుల్ స్పూన్లు వారానికి 2 లేదా 3 సార్లు

నడిచేపిల్లలకు – రోజులో ఒక స్పూన్ చొప్పున 5 సార్లు ఇవ్వచ్చు.

ఇది ఎక్కువగా సేవించడం వలన మరీ లావు పెరుగుతున్నారు? అనిపిస్తే కొన్నిరోజుల పాటు దీనిని తీసుకోవడం తగ్గించడం చేయాలి.

3.పెసరపప్పు, మినపప్పు

మినపప్పు, పెసరపప్పు పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిలో న్యూట్రియన్స్, క్యాల్షియం, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన పిల్లల ఎదుగుదలకు మంచి ఆహార పదార్థం. ఇడ్లీ పసిపిల్లలకు బెస్ట్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.

మినపప్పుతో తయారీచేసుకున్న ఇడ్లీలో రసం లేదా పప్పు నుండి వేరు చేసిన నీటిని తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి పిల్లలకు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఈ ఆహార పదార్థాలతో పాటు విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం ఫుడ్స్ అంటే గుడ్లు, చేపలు, ఆపిల్, అరటిపండు.. చీజ్, యోగర్ట్, బీన్స్, తల్లి పాలను పట్టించడం వలన నెలల పిల్లలతో పాటు సంవత్సరం దాటిన పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.   మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

పసిపిల్లలలో వచ్చే ప్రమాదకర చర్మ సమస్యలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: