మహిళలు గర్భం తో ఉన్నప్పుడు వికారం, వాంతులు రావడం సహజమే. కొంతమందిలో ఈ సమస్య గర్భం మొదటి దశలో, మరికొందరిలో గర్భం దాల్చిన కొన్ని నెలల తర్వాత మరియు ఇంకొంతమందిలో గర్భం చివరి దశలలో జరుగుతూ ఉంటుంది. అలాగే ఉదయాన్నే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కూడా. అందుకని ఈ సమస్య నుండి బయటపడటానికి ఇక్కడ చెప్పుకునే కొన్ని సహజమైన చిట్కాలను ఫాలో అవడం వలన కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.
1.అల్లం
అల్లంతో టీ చేసుకుని చల్లగా అయిన తర్వాత సేవించడం లేదా అల్లం ముక్కలుగా చేసుకుని నమలడం గానీ అల్లం వాసన చూడటం వలన వికారం తగ్గుతుంది.
2.పుచ్చకాయ
పుచ్చకాయను ముక్కలుగా చేసుకుని లేదా పుచ్చకాయ జ్యూస్ గా చేసుకుని సేవించడం వలన వికారం నుండి బయటపడవచ్చు.
3.దాల్చిన చెక్క
మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వికారం మరియు వాంతులు తగ్గించడానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కతో ఆవిరి పట్టుకోవడం లేదా దాల్చిన చెక్కను వాసన చూడటం వలన వికారం తగ్గుతుంది. దాల్చిన చెక్కతో తయారుచేసుకున్న టీ తాగినా మంచి ఫలితం ఉంటుంది.
4.నీరు
డీ హైడ్రేషన్ కారణంగా గర్భంతో ఉన్న మహిళలు వికారం సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు కాబట్టి ఒకేసారి ఎక్కువగా కాకుండా కొద్ది మొత్తంలో అయినా రెండు లేదా మూడు లీటర్ల నీటిని రోజులో కనీసం తాగడం చేయాలి.
5.పుదీనా
పుదీనాను రోజు రెండు ఆకులు తినడం వలన వికారం సమస్య ఉండదు. అలాగే పుదీనాతో టీ కాచుకుని సేవించినా మంచి ఉపయోగం ఉంటుంది.
6.ఆహారం
గర్భంతో ఉన్నప్పుడు మహిళలు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కేవలం మూడు పూటలే కాకుండా కొద్ది మొత్తంలో అయినా రోజుకి ఐదు లేదా ఆరు సార్లు తినడం చేయాలి. మీరు తీసుకునే ఆహారంపైనే మీ బిడ్డ ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
7.మునక్కాయ
మునక్కాయతో చేసిన సాంబార్, మునక్కాయ కూరలు తీసుకోవడం వలన వికారం ఉండదు. అలాగే గర్భంతో ఉన్నవారు తము పడుకునే విధానంలోనూ శ్రద్ధ వహించాలి. అలాగే ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.