మీరు గర్భవతిగా ఉన్న సమయంలో ఒకరి కోసం కాదు ఇద్దరి కోసం తినాలి కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. సరైన ఆహరం తీసుకోవడం మీకు కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు అత్యంత అవసరం. అలాగే ప్రసవం తరువాత మీరు పిల్లలకు పాలు ఇవ్వాలి కాబట్టి అప్పుడు కూడా అధిక పోషకాలు ఉన్న ఆహరం తీసుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నన్సీ సమయంలో మరియు ప్రెగ్నన్సీ తరువాత ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులు ఏమిటో తెలుసుకుందాము.
గర్భంతో ఉన్నప్పుడు
ఐరన్ ఎక్కువ
గర్భం దాల్చిన సమయంలో ఎక్కువ ఐరన్ మరియు పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. పీచు పదార్థం ఎక్కువ తీసుకోవడం వలన మలబద్దకం రాదు, అలాగే ఐరన్ సరైన మోతాదులో తీసుకోవడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ నిలువలు ఉండి ప్రసవం తరువాత జరిగే రక్త స్రావం తగ్గుతుంది.
పప్పులు
పప్పులు మరియు ధాన్యాలు ఆహారంలో భాగంగా చేసుకోవం కూడా ఉత్తమం. ఎందుకంటే వీటిలో కొవ్వు విలువలు తక్కువగా ఉంటాయి, అందువలన ప్రసవం తరువాత బరువు తగ్గడం సులువవుతుంది.
మసాలా తగ్గించండి
ప్రెగ్నన్సీ సమయంలో ఎక్కువ కారం మరియు మసాలాని వీలైనంత తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో పేగులు సున్నితంగా ఉంటాయి కనుక ఎక్కువ మసాలా వంటివి తినడం ద్వారా అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
నూనె మితంగా
నూనె వస్తువులు మితంగా తీసుకోండి, డాక్టర్ని సంప్రదించకుండా ఎటువంటి మందులు వేసుకోకండి. చివరగా ధూమపానానికి మద్యపానానికి దూరంగా ఉండండి.
ప్రసవం తరువాత
కాఫీ వద్దు
ప్రసవం తరువాత, కెఫిన్ ఎక్కువ స్వీకరించకండి. కెఫీన్ కాఫీ, డార్క్ చాక్లెట్స్లో ఎక్కువ ఉంటుంది. కెఫీన్ తీసుకోవడం మీ బిడ్డకు పాలు ఇచ్చినప్పుడు వాళ్లకు కూడా వెళ్లి సమస్యలు వస్తాయి. అసలే అనేక కారణాల వలన ప్రసవం తరువాత మీకు నిద్ర సరిగా రాదు, ఇంకా కెఫీన్ తాగితే ఈ పరిస్థితి మరింత పెరుగుతుంది.
వెంటనే వద్దు
ప్రసవం తరువాత మీరు బరువు తగ్గాలనుకోవడం సహజమే. కానీ వెంటనే డైటింగ్ మొదలు పెట్టకండి. మీ పిల్లలకు పాలు ఇచ్చే అన్ని రోజులు మీరు మంచి ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. కాబట్టి మంచి ఆహారామ్ తినండి, కొన్ని రోజుల తరువాత మీ శరీరం మీద ద్రుష్టి పెట్టండి.