బిడ్డకు పాలు ఇస్తున్న తల్లి తప్పక తీసుకోవాల్సిన 3 ఆయుర్వేద ఆహారాలు

ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన తరవాత స్త్రీ ఎంత ఆనందిస్తుందో, అదే బిడ్డ ఆకలి తీర్చేందుకు సరిపడా పాలు లేకపోతే అంతే నిరుత్సాహ పడుతుంది.  మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లి పాలు చాలా ముఖ్యం మరియు ఆరోగ్యకరం కూడా. అయితే చాలామంది బ్రెస్ట్ మిల్క్ లేకపోవడం వలన ఆందోళన పడుతున్నారు.  ఈ విషయంలో వైద్యుల సలహా ఎంత అవసరమో ఇక్కడ చెప్పుకునే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా అంతే అవసరం.  ఈ ఆహారాలను ప్రసవం తర్వాత తల్లి తీసుకోవడం వలన బిడ్డకు పాల సమస్య అనేది ఉండదు. బ్రెస్ట్ మిల్క్ పెంచడానికి ఆ ఆయుర్వేద ఆహారాలేంటో ఒక్కసారి చూద్దాం…

మెంతులు

బిడ్డకు తల్లి పాలుచాలా అవసరం అని అందరికీ తెలిసిందే కాబట్టి ప్రసవం తర్వాత మహిళలు మెంతులను తమ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన బ్రెస్ట్ మిల్క్ పెరుగుతాయి. పాల ఉత్పత్తి పెరగడానికి మెంతులతో చేసిన ఆహారం లేదా మెంతుల కషాయం ఇవ్వడం వలన మంచి ఉపయోగం ఉంటుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి వలన మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు కానీ వెల్లుల్లి ఘాటుగా ఉండటం వలన తినడానికి ఇబ్బందిపడుతూ ఉంటారు. కానీ మిగతా సమయంలో ఎలా ఉన్నా ఫర్వాలేదు ప్రసవం తర్వాత రోజుకొక వెల్లుల్లి డైరెక్ట్ గా లేదా ఆహారంలో తీసుకుంటే పాల ఉత్పత్తికి మంచిది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఓట్స్

ప్రసవం తర్వాత మహిళలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఓట్ మీల్ ను కొన్ని రోజుల పాటు మీ డైట్ లో భాగంగా చేర్చుకోవడం వలన బ్రెస్ట్ మిల్క్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది.

తులసి

తులసి ఆకులు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో. ప్రతి రోజు ఉదయం ముఖం కడిగిన తర్వాత రెండు తులసి ఆకులను తినడం వలన బ్రెస్ట్ మిల్క్ పెంచడానికి బాగా ఉపయోగపడతాయి మరియు ఎటువంటి ఇన్ఫెక్షన్స్   రాకుండా అడ్డుకోగలదు.

నల్లని నువ్వుల గింజలు

నువ్వుల గింజలలో ఉండే కాల్షియం బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. వీటిని పంచదార, పాలు, బాదంలతో మిక్స్ చేసి తీసుకోవచ్చు. మరీ ఎక్కువగా కాకుండా కొద్ది పరిమాణంలో తీసుకోవాలి.

మునక్కాయ

మునక్కాయలలో ఉండే ఐరన్ మరియు కాల్షియం పాల ఉత్పత్తిని పెంచగలవు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచగలవు మరియు నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

సోంపు

మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత తీసుకునే సోంపు వలన జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా బాలింతల పాల ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది కూడా.

ఫైబర్ ఫుడ్స్

ప్రతి రోజూ గ్రీన్ వెజిటేబుల్స్, దుంపలు, రెడ్ వెజిటేబుల్స్, కాకరకాయ, జీడిపప్పు, బాదంలను తీసుకోవడం వలన బ్రెస్ట్ మిల్క్ ను పెంచేందుకు దోహదపడతాయి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు. 

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: