బ్రెయిన్ ఫుడ్స్ : పిల్లల బ్రెయిన్ పవర్ పెంచే 5 అద్భుతమైన ఆహారాలు

మీ పిల్లల మెదడు ఎదుగుదల కోసం ఏమి చేయాలి అని మీరు ఆలోచిస్తున్నారా?  మీ పిల్లలను చురుకుగా, అద్భుతమైన తెలివితేటలు  కలిగిన పిల్లలుగా పెంచాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ ఆహారాలు వారికీ తినిపించండి. పిల్లల మొదటి మూడు సంవత్సరాలు మెదడు  ఎదుగుదలలో ముఖ్యమైన కాలం. ఆ సమయంలో ఈ బ్రెయిన్ ఫుడ్స్ వారి తెలివి తేటలు పెంచడానికి చాలా సహాయపడుతాయి. అవేంటో ఇక్కడ చూడండి… 

1.గ్రీక్ యోగర్ట్

సాధారణ పెరుగు నుండి నీరును, లాక్టోస్ ను తీసేయడం ద్వారా గ్రీక్ యోగర్ట్ తయారవుతుంది. ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. పిల్లల మెదడు ఎదుగుదల కోసం ఇది ఒక అద్భుతమైన ఆహరం. ఇందులో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ , మెదడు టిష్యూస్, మరియు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎదుగుదలకు చాలా అవసరం.

2. కూరగాయలు

తాజా కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను ఆరోగ్యాంగా ఉంచుతాయి. పిల్లల మెదడు ఎదుగుదలకు తినిపించాల్సిన కూరగాయలు; చిలకడదుంప, గుమ్మడికాయ, కార్రోట్స్. పాల కూర కూడా తినిపించండి.

3. బ్రోకలీ

బ్రోకలీ మరొక అద్భుతమైన బ్రెయిన్ ఫుడ్. ఇందులో ఉండే DHA మెదడులోని న్యూరాన్లను ఉతేజపరుస్తుంది. ఇది శరీరంలోని క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తుంది.

4. అవకాడో

అవకాడో లో అసంతృప్త కొవ్వులు (unsaturated fats),ఒలిక్ ఆసిడ్స్ (oleic acids) పుష్కలంగా ఉంటాయి. అసంతృప్త కొవ్వులు మెదడులో రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. ఒలిక్ ఆసిడ్స్ మెదడులో ఉండే మైలిన్ (myelin) అనే పదార్ధాన్ని రక్షిస్తాయి. ఈ మైలిన్ మెదడులో సమాచారాన్ని గంటకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణించడానికి సహాయపడుతుంది.

5. చేపలు

సాల్మన్, ట్యూనా లాంటి చేపలలో ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు కణాల నిర్మాణానికి, ఎదుగుదలకు చాలా తోడ్పడుతాయి. పిల్లల మానసిక నైపుణ్యాలను పెంచుతాయి.

6. గుడ్లు

గుడ్లు, ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్స్, జింక్, కోలిన్ లాంటి పోషకాలతో నిండి ఉంటాయి. పిల్లలకు తప్పకుండా రోజుకు ఒక గుడ్డు తినిపించడం వలన, వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి.

7. తృణధాన్యాలు (Whole grains)

గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు లాంటి తృణ ధాన్యాలలలో ఫోలేట్ ఉంటుంది. ఇది మెదడు పనితనాన్ని పెంచుతుంది. రోజు మొత్తం మెదడుకు శక్తిని అందచేస్తూ పిల్లలను చురుకుగా ఉంచుతాయి.

8. ఓట్స్

ఈ మధ్య జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజు ఉదయం ఓట్స్ తీసుకుంటున్న పిల్లలు, ఎక్కువ జ్ఞాపకశక్తిని కలిగి ఉంటున్నారు, అని తేలిసింది. ఓట్స్ ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ E, జింక్ పిల్లల మెదడు ఎదుగుదలకు చాలా అవసరం.

9. బెర్రీస్

బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్ప్ బెర్రీ, స్ట్రా బెర్రీ ఇప్పుడు అన్ని మార్కెట్ లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని మీ పిల్లలకు తప్పకుండా తినిపించండి. వీటిలో అధికంగా వుండే విటమిన్ C పిల్లల మెదడు పై వత్తిడిని తగ్గిస్తుంది.

10. నట్స్

 

 

బాదాం, పిస్తా, వాల్ నట్స్ , జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ ను మీ పిల్లల ఆహారంలో తప్పకుండా భాగం చేయాలి . వీటిలో ఉండే విటమిన్స్, పోషకాలు పిల్లల మెదడు ను మందగించకుండా రక్షిస్తాయి.

Leave a Reply

%d bloggers like this: