భారతీయ వివాహ సాంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు : ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం..

పెళ్లి..ఇద్దరు వ్యక్తులు పది కాలాల పాటు కుటుంబంతో పిల్లా పాపలతో సంతోషంగా జీవించడానికి కుటుంబ పెద్దలు, బంధువుల సమక్షంలో వేద మంత్రాల,  అగ్ని మండపం సాక్షిగా అందరి ఆశీర్వాదాలతో ఒక్కటి కావడమే పెళ్లి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో వివిధ రకాలుగా తమ ఆచారాలు, సాంప్రదాయాలను బట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే మనదేశ సాంప్రదాయం ప్రకారం, నమ్మకాల ప్రకారం వివాహ సాంప్రదాయాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం..

1.మెహందీ

భారతీయ వివాహ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో తప్పనిసరిగా వధువు చేతులకు, పాదాలకు గోరింటాకును పెట్టడం. అలాగే వరుడికి ఈ విధంగా చేస్తారు. ఇలా అలంకరణలో భాగంగా మాత్రమే చేస్తారా? అంటే అందుకోసమే కాదు. దీని వెనుక ఒక సైన్టిఫిక్ రీజన్ కూడా ఉంది. మెహందీ లేదా గోరింటాకు రాసుకోవడం వలన యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. అలాగే ఒత్తిడి, తలనొప్పి మరియు జ్వరం ఉన్నా తగ్గిస్తుంది. చేతి గోర్లు అందంగా పెరగడానికి మరియు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ శరీరానికి సోకకుండా ఆపగలగుతుంది.

2.పసుపు

పెళ్లితంతులో భాగంగా వధువు మరియు వరుడికి పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురిని ముస్తాబు సమయంలో ముఖానికి, చేతులకు మరియు పాదాలకు పసుపును రాస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అనే అనుమానం చాలామందికి వచ్చే ఉంటుంది. పసుపు సహజ సిద్ధంగా అందం పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. అలాగే శరీరానికి ఎటువంటి క్రిమికీటకాలు, ఎటువంటి వ్యాధులను అంటకుండా దోహదపడుతుంది. అందుకే మన వివాహ సాంప్రదాయంలో పసుపును భాగంగా చేర్చడం జరిగింది.

3.చేతులకు గాజులు

భారతీయ వివాహ సాంప్రదాయంలో పెళ్లిలో పెళ్లికూతురు చేతులకు ముఖ్యంగా ఉండవలసినవి గాజులు. ఆడవారికి మరింత అందంగా ఉండే ఈ అలంకరణ వెనుక ఉన్న శాస్త్రీయ కారణం తెలిస్తే నిజమేనని మీరు అనకఉండలేరు. చేతుల మణికట్టు నుండి మోచేతుల వరకు గాజులు ధరించడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే ఎటువంటి ఆందోళనలు లేకుండా ఒత్తిడిని దూరం చేస్తుంది.

4.సింధూరం

మన హిందూ వివాహ సాంప్రదాయం ప్రకారం వివాహిత అయిన స్త్రీ తప్పకుండా నుదుట బొట్టు మరియు నుదుటిపైన వెంట్రుకలకు పై భాగంలో సింధూరంను పెట్టుకుంటారు. అలాగే పెళ్లి అయి భర్త చనిపోయిన వారు బొట్టు ధరించరు మరియు సింధూరం కూడా పెట్టుకోరు. ఎరుపు రంగు సింధూరం పెట్టుకోవడం వలన సంతానోత్పత్తికి సంకేతంగా భావిస్తారు. అలాగే స్త్రీల ఋతుక్రమానికి గుర్తుగా సింధూరం ఆంతర్యం గురించి చెబుతున్నారు కూడా. సింధూరం పెట్టుకోవడం వలన ఈ ప్రదేశంలో శక్తులు అన్నీ కేంద్రీకరిస్తాయని అలాగే మైండ్, బాడీ చాలా రిలాక్స్ గా కూడా ఉంటుందని అంటారు.

5.కాలికి మెట్టెలు

పెళ్లిలో జరిగే అతి ముఖ్యమైన కార్యక్రమాలలో వరుడు వధువు కాలికి మెట్టెలు తొడగడం. పెళ్లి కూతురు కాలి రెండవ వేలికి కాలి మెట్టెలు తొడగడం వలన స్త్రీ గర్భాశయానికి మరియు గుండెకు అనుసంధానంగా నాడులు జతకట్టి ఉంటాయి. అలాగే సంతానోత్పత్తి బాగా జరుగుతుంది అని చెప్పడానికి. ఇక రెండవ కాలికి మెట్టెలు ఉండటం వలన భూమి నుండి వచ్చే ధృవపు శక్తి శరీరాన్ని ఆకర్షిస్తుంది. వివాహిత అని తెలుపడానికి ఇది ఒక గుర్తు.

6.అగ్నిమంటపం

పెళ్లితంతులో భాగంగా వరుడు, వధువు ఇద్దరూ కలిసి హోమగుండంలో నెయ్యిని వేస్తూ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన అంతా మంచే జరుగుతుంది అని చెప్పడానికి. ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా కూడా ప్రవేశించవని. అలాగే హోమగుండంలో నెయ్యి, కలప, బియ్యం మరియు ఇతర మూలికలు వేయడం వలన హోమగుండం నుండి విడుదలయ్యే పొగ శరీరానికి శక్తివంతమైన ఏజెంట్ గా పనిచేస్తుంది. చుట్టూ ఉన్నవారు ఈ పొగను పీల్చినా వారికి మంచే జరుగుతుంది అని చెప్పడానికి..

సో, ఇవండీ మన హిందూ వివాహ సాంప్రదాయం ప్రకారం మనదేశంలో అనాదిగా పాటిస్తున్న వివాహ సాంప్రదాయాలు. ఇంకా చాలా రకాల వివాహ సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో మీకు ఏమైనా తెలిసి ఉంటే COMMENT చేయగలరు. అలాగే ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే LIKE  SHARE చేయండి. 

Image Source : Tollywood Celebreties News

Leave a Reply

%d bloggers like this: