మహిళలలో తలనొప్పి, కడుపునొప్పి, నడుం నొప్పి..తగ్గడానికి ఒక్కసారి ఈ ఇంటి చిట్కాలు వాడితే చాలు

రోజంతా ఇంటి పనులు చూసుకుని, ఆఫీస్ కు వెళ్లి మళ్ళీ ఇంటి పనులతో సతమతమయ్యే మహిళలను మనం డైలీ చూస్తూనే ఉన్నాం. వారిలో ఈ చిన్న చిన్న సమస్యలు తరచూ వస్తుంటాయి. పేరుకు చిన్న చిన్న సమస్యలే అయినా తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి. మహిళలను ప్రతిరోజూ వేధించే సమస్యలు అందుకు ఇంటి నుండే ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకోండి.

నడుం నొప్పి

ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి మహిళకు విశ్రాంతి అనేది ఉండదు. ఇలా ఇంటి పనులకే పరిమితం అయ్యేవారిలో ఎక్కువగా నడుం నొప్పి సమస్యలు వస్తుంటాయి. నడుం నొప్పి తగ్గడానికి ఈ రెండు చిట్కాలను వెంటనే ఫాలో అవ్వండి.

కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరాన్ని కలపాలి. ఆ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు వేడి చేయాలి. అది పూర్తిగా చల్లారిన తరువాత ఓ బాటిల్‌లో  పోసి నిల్వ చేసుకోవాలి. పడుకోబోయే ముందు ఈ నూనెతో నడుముకు మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. లేదా

ఒక గ్లాస్ గోరు వెచ్చని వెల్లుల్లి రసాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వలన నడుం నొప్పి తగ్గిపోతుంది.

తలనొప్పి 

మహిళలు ఎక్కువగా బాధపడే సమస్యలలో తలనొప్పి ఒకటి. రుతుక్రమం సమయాలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అలాగే మరికొందరిలో మైగ్రేన్ సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. అందుకని

యూకలిఫ్టస్ తైలంతో తలనొప్పిగా ఉన్నప్పుడు తలపై మర్దనా చేసుకోవడం వలన తలనొప్పి నుండి వెంటనే బయటపడవచ్చు.

ఒక గ్లాస్ గోరు వెచ్చనినీటిలో వేడి నీరు కలుపుకుని సేవించడం వలన తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

మోకాళ్ళ నొప్పులు

వందమందిలో కనీసం ఎనభై మంది ఈ సమస్యను ఎదుర్కోవడం జరుగుతోంది. మోకాళ్ళ నొప్పుల నుండి వెంటనే బయటపడటానికి ఇలా చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది.

ఒక కప్పు నువ్వుల నూనె తీసుకుని, అందులో నాలుగు వెల్లుల్లిలను వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత కిందకు దించి చల్లార్చాలి. చల్లారిన తర్వాత వడగట్టుకుని మోకాళ్ళపై మర్దనా చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఉండవు.

ప్రతిరోజూ ఒక స్పూన్ మెంతుల పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కడుపు నొప్పి

కడుపులో నొప్పి, కడుపులో మంట సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఈ చిట్కాలను ఫాలో అయితే వెంటనే   ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

ఒక స్పూన్ నిమ్మరసం మరియు పుదీనా రసం, రెండు చుక్కల అల్లం రసం,  కొద్దిగా పెప్పెర్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెంటనే సేవించడం వలన కడుపునొప్పి దూరమవుతుంది.

 జీలకర్రలో కొద్దిగా చక్కెర కలిపి తీసుకోవడం వలన కడుపు నొప్పి నుండి బయటపడవచ్చు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మీ భర్తను ఆకర్షించడానికి 10 చిట్కాలు

Leave a Reply

%d bloggers like this: