మునగలో క్యాల్షియం, ఇనుము అధికంగా ఉంటాయి. వాటితో పాటు ఇతర ఆరోగ్యకరమైన మాంసకృత్తులు విలువైన ఖనిజాలు అధికమోతాదులో లభిస్తాయి. మునగను మీ ఆహారంలో భాగం చేసుకోవడం మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది… అవేంటో తెలుసుకోండి…
1. దృఢమైన ఎముకలు

మునగలో అధికంగా వుండే కాల్షియమ్ మరియు ఐరన్ మీ ఎముకలు దృఢంగా మారేందుకు సాయపడతాయి. పిల్లల్లో ఎముక సాంద్రతను పెంచుతుంది.
2. చక్కర వ్యాధి తగ్గుతుంది

మునగాకు, గింజలకూ రక్తశుద్ధికి తోడ్పడే లక్షణాలు ఉన్నాయి. మధుమేహ బాధితులు మునగాకుని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి.
3. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది

మునగ ఆకులూ, పూలకు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి అధికమోతాదులో లభించడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
4. గర్భాశయానికి మంచిది

మునగాకు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు అదుపులో ఉంటాయి. గర్భాశయంలో వచ్చే కంతుల పరిమాణాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. మహిళలు గర్భం దాల్చినప్పుడు మునగను తప్పనిసరిగా తీసుకోవాలి.
5. శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది

శ్వాసకోస ఇబ్బందులతో బాధపడేవారికి చక్కని ఔషధం మునగాకు. అలానే మునక్కాయలను తరచూ తీసుకుంటే మంచిది. జలుబూ, జ్వరంతో బాధపడుతున్నప్పుడు మునగాకును సూప్‌గా తీసుకుంటే తక్షణ ఉపశమనం ఉంటుంది.