అప్పుడే పుట్టిన పిల్లలకు AC వాడడం ప్రమాదకరమా? అసలు నిజాలు తప్పక తెలుసుకోండి

చాలా మంది పిల్లలు హాయిగా నిద్రపోడానికి, వారు నిద్రపోయే గదిలో AC వాడుతారు. అది వాడడంలో అంత ప్రమాదం ఏమి లేదు, కానీ అప్పుడే పుట్టిన పిల్లలకు AC వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకోండి…

1. సరైన టెంపరేచర్

పిల్లల ఉన్న గదిలో వారికోసం AC వాడుతున్నప్పుడు, సరైన టెంపరేచర్ ఉండడం చాలా అవసరం. ఎప్పుడైనా పిల్లలకు AC వాడుతున్నప్పుడు 23-26 డిగ్రీల టెంపరేచర్ లో ఉంచాలి.

2. దుప్పటితో కప్పండి

అప్పుడే పుట్టిన పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. మరి ఎక్కువ చలి గాలి, చర్మం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే AC లో ఉన్నప్పుడు పిల్లల మోచేతుల వరకు దుప్పటితో కప్పండి.

3. ఎదురుగా వద్దు

AC నుంచి వచ్చే చల్లని గాలిని నేరుగా పిల్లలకు తగిలేలా ఉంచకండి. పిల్లలకు జలుబు చేయచ్చు. పిల్లలను AC కు ఎదురుగా పనుకోపెట్టకండి.

4. AC పనిచేస్తుందా?

పిల్లలకు వాడుతున్న AC సరిగా పనిచేస్తుందా లేదా ముందే చూసుకోండి. A C లో ఏదైనా సమస్య ఉంటే అది పిల్లల మీద  ప్రభావం చూపించచ్చు.

5. వెంటనే వేడి వద్దు

పిల్లలను AC లో ఉంచి, తర్వాతే వెంటనే వేడిగా ఉండే గదిలోకి తీసుకుని వెళ్ళద్దు. అలా చేయడం పిల్లలకు మంచిది కాదు.  ముందు AC ఆఫ్ చేసి, చల్లదనం తగ్గిన కాసేపటి తరువాత బయటకు తీసుకెళ్ళండి.

Leave a Reply

%d bloggers like this: