అప్పుడే పుట్టిన పిల్లలను ముద్దు పెట్టుకోవచ్చా..? అసలు ఏం జరిగిందో ఇక్కడ చూడండి..

తల్లి గర్భం నుండి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత స్త్రీలో కలిగే మాతృత్వ ఆనందభాష్పాలు, మగవారిలో కలిగే తండ్రి ఆనందానుభూతులను మాటలలో వర్ణించలేం. అలా మాటల్లో వర్ణించలేని విషయాలను చాలామంది చేతల్లో చూపిస్తూ ఉంటారు. అంటే అప్పుడే పుట్టిన పసి పిల్లలను చేతులలోకి తీసుకుని ముద్దు పెట్టుకోవడం, ఆనంద భాష్పాలతో ఒడిలోకి తీసుకోవడం చేస్తుంటారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అనే అనుమానం చాలామందికి వచ్చే ఉంటుంది.  నిజానికి ఈ విధంగా చేయడం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వలన ఏం జరుగుతుందో ఒక్కసారి మీరే చూడండి.

పవిత్రమైన తల్లి గర్భం నుండి రక్తపుముద్దలా బిడ్డ బయటకు వస్తాడు. ఆ తరవాత బిడ్డను సురక్షితంగా వైద్యులు శుభ్రం చేసి తల్లి పక్కన లేదా ప్రత్యేకంగా అమర్చిన ఒక ఉయ్యాలలో పడుకోబెడుతారు. అప్పుడే పుట్టిన కొందరు పిల్లలలో మేథో మజ్జా వ్యాధి (మెనింజైటిస్)తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన అప్పుడే పుట్టిన పిల్లలను ముద్దాడటం వలన వారి శరీరానికి మరిన్ని ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా చేరి శరీరానికి మరిన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.అప్పుడే పుట్టిన పిల్లలలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం వలన శరీరానికి త్వరగా ఇన్ఫెక్షన్స్ చేరుతాయి. వ్యాధులు కూడా వీరిలో వృద్ధి చెందుతాయి. వాటిని తట్టుకునే శక్తి అప్పుడే జన్మించిన పిల్లలకు ఉండదు . కాబట్టి అప్పుడే పిల్లలను ముద్దుపెట్టుకోకూడదు.

 పసిపిల్లలలను ముద్దు పెట్టుకోవడం వలన కలిగే ఇబ్బందులు

1.హై ఫీవర్ వచ్చే అవకాశం ఉంది.

2.వాంతులు చేసుకుంటారు.

3.పిల్లల శరీరం రోగ నిరోధక శక్తి తట్టుకోలేదు.

4.చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.

5.మెడ భాగంలో దృఢత్వం కోల్పోవడం

బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత అత్యంత ఆనందించేది తల్లే కాబట్టి తన బిడ్డను చూడగానే ముద్దు పెట్టుకోవాలని, తన వద్దకు తీసుకుని అక్కున చేర్చుకోవాలని ఉంటుంది. అయితే గర్భంతో ఉన్నప్పుడు ఆమె చుట్టూ బ్యాక్టీరియా చేరడం వలన, ప్రసవం జరిగే సమయంలో బ్యాక్టీరియా ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం వలన వైద్యులు సైతం తల్లిని బిడ్డను వెంటనే తీసుకుని ముద్దు పెట్టుకోవడం చేయకూడదని చెబుతున్నారు. బయట నుండి వచ్చేవారి నుండి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తమ చేతులు, కాళ్ళను ఎంతో శుభ్రంగా ఉంచుకుని ప్రసవం జరిగిన వార్డ్ వద్దకు వెళ్ళాలి. రేపటి భవిష్యత్ గా భావించే మీ పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే అంతా మన చేతుల్లోనే ఉంది కాబట్టి అప్పుడే పుట్టిన పసిపిల్లలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఈ విషయాన్ని ప్రతి తల్లితండ్రులు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా తల్లి తన బిడ్డను ఇతరులు ముద్దాడుతున్న సమయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చెప్పాలి.

ఈ ఆర్టికిల్ మీకు నచ్చినట్లయితే LIKE చేయండి SHARE చేయండి.  అలాగే ఈ ఆర్టికల్ పై మీ విలువైన COMMENT కూడా తెలుపవచ్చు.

ఇవి కూడా చదవండి

పుట్టిన నెలను బట్టి మీ పిల్లల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి

పిల్లలు ఆరోగ్యకరమైన చర్మంతో పుట్టాలంటే, ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: