గర్భంతో ఉన్నవారికి ఈ 4 విషయాలు ఎప్పటికీ చెప్పకూడదు : తెలియనివాళ్ళు తెలుసుకోండి

గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేది మహిళలకు దేవుడిచ్చిన గొప్ప వరమని చెప్పాలి. అలా గర్భంతో ఉన్నప్పుడు పక్కవారు,తనతోపాటు పనిచేసే సహోద్యోగులు, బంధువులు..ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆమెతో కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. గర్భంతో ఉన్నప్పుడు ఎవరూ ఎప్పటికీ చెప్పకూడని  ఆ విషయాలు ఏంటో మీరే ఒక్కసారి చూడండి.

కడుపు పగిలేలా ఉంది

తెలిసి అంటారో లేక తెలియక అంటారో గానీ గర్భంతో ఉన్నప్పుడు ఏంటి నీ కడుపు పగిలేలా గర్భం అంత ముందుకు వస్తుంది అని అనకూడదు. ఇలా అనటం వలన వారి మనస్సును గాయపరచివవారవుతారు.

నీ గర్భం తాకవచ్చా?

గర్భంతో కడుపు ముందుకు వచ్చి ఉండటం అందరిలోనూ సహజమే. అటువంటప్పుడు పక్కవాళ్ళు, సహోద్యుగులు నేను మీ కడుపును తాకవచ్చా? అని చేతులు వేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. బిడ్డకు తల్లి స్పర్శే అత్యంత ఆనందాన్ని ఇస్తుంది.

ఏంటి కడుపు చిన్నదిగా ఉంది

గర్భం దాల్చిన నెలలు గడిచేకొద్దీ బిడ్డ సైజు పరిమాణం వలన కొందరిలో కడుపు చూడటానికి పెద్దదిగా చిన్నదిగా ఉండటం సాధారణం. అందుకని ఏంటి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా కడుపు చిన్నదిగా ఉంది అని వారిని బాధపెట్టే మాటలు అనకూడదు.

డెలివరీ ఎలా ప్లాన్ చేసుకున్నావ్?

గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడు బిడ్డను కంటావు, ఎలా బిడ్డకు జన్మనిస్తావు, నార్మల్ డెలివరీ ప్లాన్ చేసుకున్నారా? లేక సిజేరియన్ ప్లాన్ చేసుకున్నారా? అనేవిధంగా వారితో అనటం వలన ఒత్తిడి, భయాందోళనలకు గురయ్యే ప్రమాదం ఉంది.

బ్రెస్ట్ ఫీడ్ గురించి

బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత తల్లి పాలు ఇస్తావా? లేక బుడ్డి పాలు ఇస్తావా అని ఎప్పుడో జరగబోయే విషయాల గురించి ముందుగానే డిస్కస్ చేయడం మంచిది కాదు. ప్రతి తల్లికీ బిడ్డకు తల్లి పాలే ఇవ్వాలని కోరుకుంటుంది.

కవలలు పుడతారా? అయ్యో కష్టమే..

ఏంటి డాక్టర్ కవల పిల్లలు అని చెప్పాడా! కవల పిల్లలు పుడితే వారికి పాలు ఇవ్వటం ,  వారిని ఆడించడం, వారితో సమయం గడపడం చాలా కష్టం అవుతుందే..ఎలా చూసుకుంటావో ఏమో అని అనటం వలన నిరుత్సహానికి గురవుతారు.

నిద్ర ఉండదు?

పిల్లలు పుట్టిన ఏ తల్లీ తన నిద్ర గురించి ఆలోచించదు. తన బిడ్డ ఆరోగ్యం గురించే ఆలోచిస్తుంది కాబట్టి బిడ్డ పుట్టాక నీకు నిద్ర ఉండదు, ఎలా ఉంటావో ఏమో అని చెప్పడం చేయకూడదు.

చావు వార్తలు

బయట ఎక్కడో జరిగిన ప్రమాదకర విషయాలు,  భయపెట్టే విషయాలు, చావు వార్తలు వంటివి పనిగట్టుకుని వారికి చెప్పడం వలన వారు తెలియకుండానే అదే ఆలోచనలతో ఉంటారు. అది పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపెడుతుంది.

అది తినాలి? ఇది తినకూడదు?

గర్భంతో ఉన్నవారికి ఎప్పుడూ అది తినకూడదు, ఇది మాత్రమే తినాలి, ఫలానావి మాత్రమే తాగాలి అనే విషయాలను మీకు తెలిసో తెలియక చెప్పడం వలన వారికి చాలా ప్రమాదం. ఎలాగూ వారు డాక్టర్ ను సంప్రదిస్తున్నారు కాబట్టి మీరు వారిని ఇబ్బందిపెట్టే ఆహారాల గురించి మాట్లాడకూడదు.

మనలో చాలామంది తెలిసో, తెలియకనో అనే మాటలు, చెప్పే విషయాలు వారి గర్భం మరియు పుట్టబోయే బిడ్డపై ఏదో విధంగా ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి కాబట్టి మాట్లాడే ప్రతి మాట వారికి సంతోషం కలిగేలా ఉండాలి కానీ బాధపెట్టేలా ఉండకూడదు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

గర్భధారణ సమయంలో వచ్చే థైరాయిడ్ బిడ్డకు ప్రమాదమా?

Leave a Reply

%d bloggers like this: