పిల్లలు కడుపులో ఉన్నప్పుడు, తల్లితో కలిపివుంచేది బొడ్డు తాడే. తల్లి నుండి ఆహారం, పోషక విలువలు బిడ్డకు దీని ద్వారానే అందుతాయి. కాన్పు జరిగిన తరువాత బొడ్డు తాడు కత్తిరిస్తారు. కానీ పిల్లలకు అది అంటుకునే ఉంటుంది. 2-4 వారాల తరువాత రంగు మారి ఊడిపోతుంది. అయితే బొడ్డు తాడుతో ఉన్నప్పుడు, పిల్లలకు స్నానం చేయించే సమయంలో, కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం చాలా అవసరం.. అవేంటో ఇక్కడ తెలుసుకోండి
1. ఎప్పుడు పొడిగా ఉండాలి
పిల్లల బొడ్డు తాడు, ఎండిన తరువాత ఊడిపోతుంది. ఈ క్రమంలో దానికి తడి తగలనివ్వకూడదు. ఎప్పుడు పొడిగా ఉంచాలి. స్నానం చేయించిన తరువాత అక్కడ నెమ్ము చేరనివ్వకండి. ఇయర్ బడ్స్ , పొడి బట్టతో తుడవండి.
2. స్నానం జాగ్రత్త
పిల్లలు పుట్టిన మొదటి 2-4 వారాల వరకు బొద్దు తాడు అలానే ఉంటుంది. ఈ సమయంలో స్నానం చేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పూర్తి నీళ్ళతో తడిపేయకుండా, తడి బట్టతో పిల్లల వంటిని తుడిస్తే సరిపోతుంది.
3. వదులైన బట్టలు
పిల్లలకు బొడ్డు తాడు ఉన్న సమయంలో, బిగుతుగా బట్టలు వేయకండి. అలా చేయడం వలన బొడ్డు తాడు త్వరగా ఎండిపోదు. ఈ సమయంలో పిల్లలకు వదులుగా ఉండే బట్టలు మాత్రమే వేయండి.
4. డైపర్ మడవండి
పిల్లలకు డైపర్ తొడిగిన తరువాత, ఒకవేళ అది బొడ్డు తాడును తాకుతుంటే, కిందకు మడవండి. అలా చేయడం వలన బొడ్డు తాడు త్వరగా ఆరుతుంది.
5. లాగద్దు
ఎట్టి పరిస్థితిలో కూడా బొడ్డు తాడును లాగకూడదు. ఒకవేళ బొడ్డు తాడు ఊడడం లేట్ అయినా సార్, అది ఎండే వరకు వెయిట్ చేయండి. లాగద్దు.
ఈ విషయాలు అందరికి తెలిసేలా తప్పకుండా SHARE చేయండి
ఇవి కూడా చదవండి…
తల్లి పాలు VS ఫార్ములా పాలు : ‘ప్రయోజనాలు – అప్రయోజనాలు’ పూర్తి వివరంగా…