బెడ్ వెట్టింగ్ అనేది చిన్న పిల్లల్లో చాలా సాధారణ విషయం. దాదాపు 20 శాతం మంది 5 ఏళ్ళ పిల్లలు, 10 శాతం మంది 6 ఏళ్ళ పిల్లలు రాత్రిల్లో పక్క తడుపుతారు. అయితే దీన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అవేంటంటే,
నిందించకండి
పక్క తడపడం అన్నది చిన్న పిల్లలో చాలా కామన్. దీని గురించి మీరు ఆందోలన చెందకండి. అంతేకాక, మీ పిల్లల మీద నింద వేయకండి. పక్క తడిపినంతమాత్రాన వచ్చే నష్టమేమీ లేదు. ఊరికే వాళ్ళను తిట్టడం వల్ల వారు హర్ట్ అవుతారు.
టీజ్ చేయకండి
ఇంట్లో ఎవరైనా పాస్ పోసేవారుంటే మిగిలిన వారు వారిని గేలి చేయకుండా చూసుకోండి. గేలి చేస్తే పిల్లలు ఆత్మన్యూనతా భావనకు గురౌతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.
బెడ్‌కు ముందు యూరిన్
పడుకొనే ముందు పిల్లలను యూరిన్ పోసి రామని చెప్పండి. దాన్ని ఒక అలవాటుగా మార్చడం ద్వారా వారు పక్క తడపకుండా చేయవచ్చు.
అలార్మ్ పెట్టడం
మీ పిల్లలు బెడ్ వెట్టింగ్ చేసే సమయాన్ని గమనించి అలార్మ్ పెట్టండి. దీని వల్ల వారు తొందరగా లేచి బాత్రూమ్కు వెళ్ళే విధంగా అలవాటూ చేయండి.
క్యాలెండర్
పిల్లలు ఎప్పుడు పాస్ పోయరో, ఏరోజు పోస్తారో తేదీలు వేసి చూపించండి. దీని వల్ల వారు ఆశావహ దృక్పథాన్ని అలవాటు చేసుకొని పాస్ పోయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు.
ద్రవాలు తీసుకోకపోవడం
సాయంత్రాలలో ద్రవరూప ఆహారం ఎక్కువ తీసుకోవడం ద్వారా ఆ ప్రభావం రాత్రి పక్క మీద ఉంటుంది. కాబట్టి సాయంత్రం, రాత్రి పూటల్లో ద్రవరూప ఆహారాన్ని తీసుకోకుండా చూడటం మంచిది.
బాత్రూమ్ ఉపయోగించేలా ప్రోత్సహించడం
మీ పిల్లలు నిద్రలో లేచి బాత్రూమ్ను ఉపయోగించేలా ప్రొత్సహించడం మంచిది. దీని ద్వారా వారు కొన్ని రోజులలోనే వాష్‌రూమ్ వెళ్ళడం నేర్చుకొని మీ ఇబ్బందిని తగ్గిస్తారు.
వాటర్‌ఫ్రూఫ్ బట్టలు
వాటర్ ఫ్రూఫ్ బట్టలు మంచం మీద పరచడం వల్ల వారు యూరిన్ పోసినా మీకు పెద్దగా శ్రమ ఉండదు కాబట్టీ వాటర్ ప్రూఫ్ బట్టలు లేదా కవర్స్ ఉపయోగించదం మంచిది.
గిఫ్ట్ ఇవ్వడం
మీ పిల్లలు నిద్రలో పక్క తడపని రోజుని గుర్తించి వారికి ఏదైనా బహుమతిని ఇవ్వండి. దీని వల్ల వారు బాత్రూమ్కు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు.
వైద్యుడు
మీరు పైవన్నీ చేసినా కూడా అతనిలో కనీస మార్పు లేదంటే వైద్యున్ని సంప్రదించడం మంచిది.