పుట్టిన రాశిని బట్టి మీ భర్త ఎలాంటి వాడు, మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకోండి…

చాలా మంది జోతిష్య శాస్త్రాన్ని మీద నమ్మకం ఉంచుకుంటారు. అదృష్టం, ధనం, లాభం రాశి ద్వారా వీటిని మాత్రమే కాదు.  పుట్టిన రాశిని బట్టి మీ భర్త ఎలాంటి  తల్లో సులభంగా చెప్పవచ్చు. తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న వాటిని చదవండి…

మేష రాశి (మార్చ్ 20 —ఏప్రిల్ 19)

ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు. కొన్ని సార్లు  మొండిగా, కోపంగా ఉంటారు. వీరు తమ పిల్లలని స్వతంత్ర భావాలతో, గొప్ప నాయకులుగా తయారు చేస్తారు.

వృషభ రాశి (ఏప్రిల్ 20 —మే 20)

ఈ రాశిలో పుట్టిన వారు సాంప్రదాయంగా ఉంటారు. తమ చుట్టూ వున్నా వాళ్ళ సమస్యలను తీరుస్తారు. పిల్లలతో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ ఆప్యాయతను వదులుకోరు.

మిథున రాశి (మే 21 —జూన్ 20)

వీళ్ళు ఎప్పుడు చాలా సరదాగా ఉంటారు. అన్ని విషయాలలో పాజిటివ్ కొనాన్ని చూస్తారు. పిల్లలతో ఆడుకోవడం , కథలు చెప్పడం లాంటివి చేస్తూ, వారితో ఎక్కువ సమయం గడుపుతారు.

కర్కాటక రాశి (జూన్ 21 —జూలై 22)

ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు ఒకలా ఉండరు. సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అన్నిటిలోను విజయాన్ని సాధిస్తారు. పిల్లలతో ప్రేమగా ఉంటారు.

సింహ రాశి(జూలై23-ఆగష్ట్22)

వీరికి చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది. పిల్లలను అన్ని విధాలుగా మీరు ప్రోత్సహిస్తారు. వారికి సంగీతం, ఆటలు, పాటలు, బొమ్మలు గీయడం వంటివి నేర్చుకోవడానికి తోడ్పడుతారు. వారికి పూర్తి స్వేచ్చను ఇస్తారు.

కన్య రాశి (ఆగష్ట్23-సెప్టెంబర్23)

ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటారు. తమ పిల్లల గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు అంతేకాకుండా క్రమశిక్షణను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తారు.

తుల రాశి(సెప్టెంబర్24-అక్టోబర్22)

వీరు అన్నిటిలో సమతుల్యత పాటిస్తారు. చదవడం, ఆడుకోవడాల మధ్య ఎలా సమతుల్యత పాటించాలో పిల్లలకు చెప్తారు. కళల మీద అభిమానం ఉంటుంది అప్పుడప్పుడూ దాన్ని వెలికి తీస్తూ ఉంటారు.

 వృచ్చిక రాశి(అక్టోబర్23-నవంబర్ 21)

ఈ రాశిలో పుట్టిన మగవాళ్ళు చాలా బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.. నిరంతం శ్రమిస్తూ ఉంటారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే మీరు ఎప్పటికి దాని నుండి విశ్రమించరు. మీపిల్లలకు కూడా అలాంటి వ్యక్తిత్వాన్నే నేర్పిస్తారు.

 ధను రాశి(నవంభర్22-డిశెంభర్21)

వీరు ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. పిల్లలకు కొత్త విషయాలు నేర్పిస్తారు. పిల్లలకు కూడా వీరు భిన్నమైన కల్చర్‌ను అలవాటు చేస్తారు.  వీరు ఉంటే మీ పిల్లలకు అస్సలు బోర్ కొట్టదు.

మకర రాశి(డిశెంభర్21-జనవరి19)

వీరికి చాలా కష్టపడే తత్వం ఉంటుంది. చేసే పని ద్వారా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. మీ పిల్లలకు కూడా అలాంటి లక్షణాలనే భోదిస్తారు తద్వారా మీ పిల్లలు కూడా జీవితంలో చాలా సాధిస్తారు.

కుంభ రాశి(జనవరి20-ఫిబ్రవరి19)

ఈ రాసిలో పుట్టిన వాళ్ళకి రోటీన్‌గా ఉండటం బోర్‌గా అనిపిస్తుంది. వీరు జీవితంలో రెబెల్స్ గా ఉంటారు. వీరి అనుభవాలే మీ పిల్లలకు పాఠాలుగా మారుతాయి అంతేకాక వారికి నిజమైన ప్రపంచాన్ని చూపిస్తారు.

 మీన రాశి(ఫిబ్రవరి20-మార్చి20)

వీరు మంచి హృదయాన్ని కలిగి ఉంటారు. అభిప్రాయాలను  మీ పిల్లలపై రుద్దరు పైపెచ్చు వారికి ఏదైనా సమస్య ఎదురైతే స్వయంగా వెళ్ళి పరిష్కరిస్తారు. ఇలాంటి వారు దొరకడం వారి అదృష్టం.

మీ ఆయనకు మర్చిపోకుండా SHARE చేయండి

ఇవి కూడా చదవండి

మీరు పుట్టిన రాశిని బట్టి మీరు ఎలాంటి అమ్మ అవుతారో తెలుసుకోండి!!

రాశిని బట్టి మీ అత్తగారు ఎలాంటి వారో తెలుసుకోండి 

Leave a Reply

%d bloggers like this: