గర్భం దాల్చిన తర్వాత మహిళలు తమ ఆహార వ్యవహార శైలిలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గర్భం దాల్చక ముందు సాధారణ ఆహారం తీసుకున్నా గర్భంతో ఉన్నప్పుడు మాత్రం పౌష్టిక ఆహారం, కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు సురక్షితం మరియు ఆరోగ్యకరం కూడా. అటువంటి ఆహార పదార్థాలలో నెయ్యిని ప్రగ్నెన్సీతో ఉన్నప్పుడు తినవచ్చా? తినకూడదా? అనే అనుమానం చాలామందిలో ఉంది. మీ ఈ ప్రశ్నకు సమాధానమే ఇక్కడ తెలుపడం జరిగింది.
గర్భంతో ఉన్నప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని తీసుకోవడం వలన బిడ్డ పిండం పెరుగుదలకు ఉపయోగపడుతుంది మరియు బిడ్డ ఆరోగ్యంగా పుట్టడానికి కారణం అవుతుంది. ఇందులో ఉండే పౌష్టికాహారమే నెయ్యిని గర్భంతో ఉన్నప్పుడు తినవచ్చు అని చెప్పడానికి అసలు రీజన్. రాజస్థాన్ లోని ఓ ప్రాంతంలో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన కడుపులోనే పిండం చనిపోయిన సంఘటనలు చాలాసార్లు జరిగాయి. తన కూతుళ్ళకు ఈ విధంగా జరిగిందని ఒక తండ్రి ఉచితంగా గర్భంతో ఉన్న మహిళలకు స్వచ్ఛమైన నెయ్యి ప్యాకెట్లను పంచుతున్నారు కూడా..