భర్త మాటను భార్య ఈ 5 పరిస్థితుల్లో ఖచ్చితంగా వినాలి. ఇది చూస్తే మీకే తెలుస్తుంది

ఏ బంధమైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగితేనే ఆ బంధం మరింత బలంగా, జీవితం మరింత ఆనందంగా ఉంటుంది.  అయితే కొన్ని కొన్ని పరిస్థితుల్లో భర్త మాటకు ఎదురునిలుస్తూ కొందరు భార్యలు ఇబ్బందిపడ్డ సంగతులను మాతో పంచుకున్నారు. ఆ పరిస్థితులు ఏంటో తెలుసుకోండి.  మీకు ఆ ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడండి.

ఆర్ధిక పరిస్థితులు

సామాన్య,మధ్య తరగతి దంపతుల జీవితాలలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్య డబ్బు. ఉన్నదాంతో సరిపెట్టుకుని, సర్దుకుని భర్త కష్టాన్ని గుర్తించకుండా ఎప్పుడు డబ్బుల గురించి గొడవపడితే ఆ బంధం ఎక్కువకాలం నిలవదు. ఇంకా ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా ఎలా ఆదా చేసుకోవాలో ఆ విధంగా మీరే చేసి చూపించి మీ భర్తను ఆనందపరచండి.

తల్లితండ్రులు-అత్తమామలు

తనను కూతురిలా చూసుకునే అత్తమామలు రావాలని కోడలిగా ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే భర్త తల్లితండ్రులు  కోడలిని ఎంత బాగా చూసుకుంటున్నా ఇంకా వారిపై తెలియని కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శిస్తూ తన భర్తను చిరాకు పెడుతూ తన తల్లితండ్రులతో గొడవపడేలా చేస్తుంటారు. ఇక్కడ సర్దుకుని వెళ్లి అని భర్త అన్నప్పుడు ఆ మాటను భార్య వింటే భర్తకు మర్యాద.

విలాసాలు

భర్త సంపాదన కుటుంబ ఖర్చులకే సరిపోతున్నప్పుడు తనకు అండగా నిలబడి అర్థం చేసుకోవాలే గానీ విలాసవంతమైన జీవితం కావాలని, మీ దాంపత్యాన్ని దూరం చేసే విలాసాలు, ఖర్చుతో కూడుకున్న కోరికలు కోరడం మీకే నష్టం. మనకు ఉన్నంతలో మంచి జీవితం గడుపుదాం అని భర్త మాటకు విలువనివ్వాలి.

లగ్జరీ లైఫ్

ప్రతి ఒక్కరికీ తమ భర్తతో కలిసి లగ్జరీ లైఫ్ పొందాలని, లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలని కోరుకోవడం తప్పు లేదు. అదే టైంలో భర్త తన కుటుంబం కోసం, తన తమ పిల్లల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బంది పెట్టకుండా మీ జీవితంలో పొందే చిన్న చిన్న ఆనందాలే గొప్ప మధురానుభూతులుగా మార్చుకోవాలి.

వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు

పక్కవాళ్ళు సుఖంగా, సంతోషంగా ఉంటే ప్రతి ఒక్కరికీ ఈర్ష్య,అసూయ కలగడం సహజమే. ముఖ్యంగా ఒకరి సంసార జీవితం గొప్పగా ఉంటే ఓర్చుకోలేని చాలామందే ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని మీ సంసార జీవితాన్ని నాశనం చేసుకోకుండా మీ భర్త అడుగుజాడల్లో నడవటం తెలివైన వారు చేసే పని.

ప్రతి భార్యకు తన భర్తతో చిన్న చిన్న ఆనందాలు అయినా సరే గొప్పగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి, భర్త కూడా బాగా అర్థం చేసుకుని నడుచుకుంటే మీ బంధం మరింత సంతోషంగా ఉంటుంది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.   

ఇవి కూడా చదవండి.

అమ్మ ఇంట్లో లేకపోతే నాన్న పిల్లలతో కలిసి చేసే పనులు ఇవి….: నవ్వడం అప్పుకోలేరు…

Leave a Reply

%d bloggers like this: