మనదేశంలో ఇప్పటికీ మన పూర్వీకులు, పెద్దలు పాటించిన కొన్ని సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటించేవారు ఉన్నారు. హిందూ సాంప్రదాయంలో ఇటువంటివే చాలానే ఉన్నాయి. అలా భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులేంటో మీరే చూడండి మీ భర్తలకు ఈ విషయాలను SHARE చేయండి.
1.కోరికలు తీర్చడం
భార్య ప్రగ్నెన్సీతో ఉన్నప్పుడు భార్య కోరిన కోరికలను తీర్చాలి. ఆమె అడిగిన విధంగా చేయడం వలన మంచి ఆయుష్షుతో బిడ్డ జన్మిస్తాడని, అలాగే భార్య కూడా ఎంతో సంతోషంగా ఫీలవుతుంది. ఈ విధంగా చేయకపోతే దోషం కలుగుతుందని మన ఆచారాలలో ఉంది.
2.శవాన్ని మోయకూడదు
ఎస్.నిజమే భార్య గర్భిణీగా ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త శవాన్ని మోయకూడదని చెబుతున్నారు.
3.సముద్ర స్నానం, చెట్టు నరకడం
భార్య ప్రగ్నెన్సీతో ఉన్నప్పుడు భార్య సముద్ర స్నానం చేయడం, చెట్టు నరకడం చేయకూడదని చెబుతున్నారు. ఎందుకంటే సముద్ర స్నానాలు చాలామంది చేస్తుంటారు కాబట్టి అరిష్టమని, చెట్టు నరకడం వలన కుటుంబంలో కలహాలు వస్తాయని అంటారు.
4. క్షౌరం చేయించుకోకూడదు
మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు కానీ భార్య గర్భం దాల్చిన 6 నెలల తర్వాత భర్త క్షౌరము చేయించుకోరాదని మన పెద్దలుచెబుతున్నారు. కానీ ఈ రోజుల్లో చాలా తక్కువమందే ఫాలో అవుతున్నారు. మీరు చూశారో లేదో పల్లెటూర్లలో ఇప్పటికీ భార్య గర్భం దాల్చిన తర్వాత ఈ విధంగా చేస్తుంటారు. కానీ చాలామందికి అలా ఎందుకనేది తెలియదు.
5.గృహ ప్రవేశం చేయకూడదు
భార్య ప్రగ్నెన్సీగా ఉన్నప్పుడు గృహ ప్రవేశం చేయడం, ఆమె 7 నెల తర్వాత తీర్థ యాత్రలు పెట్టుకోవడం, వాస్తు కర్మ, పర్వతారోహణము చేయకూడదట.
6.పిండ ప్రధానం
మన భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం భార్య గర్భిణీగా ఉన్నప్పుడు శవాన్ని అనుసరించి ఉపనయనం, పిండ ప్రధానం వంటి పనులు చేయకూడదని ఆచారాలు చెబుతున్నాయి.
ఐతే ఇక్కడ చెప్పుకునే ప్రతి విషయం అందరూ పాటించమని, పాటిస్తున్నారని కాదు..ఒకప్పుడు ఈ ఆచారాలను మనవాళ్ళు ఫాలో అయ్యారు అని చెప్పడానికే. ఇది మీకు నచ్చినట్లయితేనే LIKE చేయండి, SHARE చేయండి. అలాగే మీ COMMENT కూడా తెలుపవచ్చు.