చేతి రేఖల ఆధారంగా, సంఖ్యాశాస్త్రం ఆధారంగా మన జీవన విధానం,మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చో అని చాలాసార్లు నిరూపితమైంది. అలాగే పుట్టిన నెలను బట్టి చిన్న పిల్లల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు కూడా. మీ పిల్లలు జన్మించే నెలను బట్టి, వారి వ్యక్తిత్వం ఎలా ఉందో మీరే తెలుసుకోండి.
1.జనవరి
జనవరి నెలలో జన్మించిన పిల్లలు బయటకు వెళ్లి ఇతర పిలల్లతో కలిసి ఆదుకోవడానికి అంతగా ఆసక్తి చూపించరు. చిన్నప్పటి నుండే వీరు బాధ్యతగా వ్యవహరించడం చేస్తుంటారు. స్కూల్ లో ఇచ్చిన హోమ్ వర్క్ త్వరగా ఫినిష్ చేసేయాలనే ఆలోచన వీరి మెదడులో ఉంటుంది. ఏ చిన్న మాట అన్నా సరే బాధపడుతూ ఉంటారు కాబట్టి తల్లితండ్రులు ఈ నెలలో జన్మించిన పిల్లలను మానసిక ఉల్లాసంగా ఉండేలా చూసుకోవాలి.
2.ఫిబ్రవరి
ఫిబ్రవరి నెలలో జన్మించిన పిల్లలు సృజనాత్మకంగా ఉంటారు కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు.రొటీన్ గా ఉండటం అంటే వీరికి ఇష్టం ఉండదు. తమ చుట్టూ ఉన్నవారితో చాలా ఇష్టంగా, ప్రేమగా మెలుగుతూ ఉంటారు. ఇతరులను ఫాలో అవ్వడం ఇష్టం ఉండదు, ఏం చేసినా నేనే చేయాలి, చాలా కొత్తగా చేయాలి అనుకుంటూ ఉంటారు. ఎటువంటి సమస్య ఎదురైనా నేను ఎదుర్కోగలను అనే భావన చిన్నప్పటి నుండే వీరికి అలవాటు అవుతుంది.
3.మార్చి
మార్చిలో జన్మించిన పిల్లలకు ఇతర పిల్లలతో పోల్చితే కొంచెం సిగ్గు ఎక్కువే. రహస్యంగా మరియు సహజంగా ఉంటారు. దయ్యాలు,భయాన్ని కలిగించే విషయాలంటే చాలా ఎమోషనల్ అవుతారు. తమతో ఉన్నవారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు కానీ అంత శ్రద్ధ చూపించలేరు. ఈ నెలలో జన్మించిన పిల్లలు ఇతరులపై దయ ఉంటుంది మరియు నిజాయితీగా ఉంటారు.
4.ఏప్రిల్
ఈ నెలలో పుట్టిన పిల్లలకు రిస్క్ చేయడం అంటే చాలా ఇష్టం. వయసు పెరిగే కొద్దీ పాత విషయాలను మళ్ళీ మళ్ళీ చేయడం అంటే అస్సలు ఇష్టపడరు. కొత్తగా అందరికంటే విభిన్నంగా ఆలోచిస్తారు అదే విధంగా జీవించడానికి ఇష్టపడతారు. వీరికి డల్ గా ఒకే చోట ఉండటం అంటే అస్సలు ఇష్టం ఉండదు చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. నిజానికి వీరిని చూసి వీళ్ళలా ఉండటానికి ఇతరులు కూడా ప్రయత్నం చేస్తుంటారు.
5.మే
మే నెలలో జన్మించిన పిల్లలకు కోపం వెంటనే వచ్చినా మళ్ళీ కొన్ని నిముషాలలోనే శాంతపడతారు. చిన్నప్పటినుండీ ఏ పని అయినా సరే కరెక్ట్ టైంలో చేయడం, బాధ్యతగా,జాగ్రత్తగా చేయడం నేర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులే సర్వసంగా ఉంటారు. నమ్మకస్తులు కూడా.
6.జూన్
జూన్ నెలలో జన్మించిన వారు ఎప్పుడు నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. ఇతరులపై జోక్స్ వేయడం, నవ్వించడం వీరికి అలవాటైనా వారి మనసును మాత్రం కష్టపడే విధంగా చేయరు. రేపటి గురించి ఆలోచించడం కన్నా నేడు ఏంటనేదే వీరికి చాలా ఇష్టం. ఎక్కడైనా సరే ఎవరితోనైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడగలరు మరియు వారిపై వారికి అపారనమ్మకం ఎక్కువ.
7.జులై
జులై జన్మించిన పిల్లలు ఏ విషయమైనా కొంచెం ముందుగానే ఊహించగలరు. కుటుంబం అంటే చాలా ఇష్టం. తమ కుటుంబానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా తట్టుకోలేరు. సమస్యలను సులభంగా సాధించుకోవడం వీరి సొంతం.
8.ఆగస్టు
ఆగస్టు లో పుట్టిన పిల్లలు నిజాయితీపరులు నమ్మదగిన వారు. ఇతరులకు తమపరంగా ఎటువంతో ఇబ్బంది కలగకుండా వారితో మర్యాదగా వ్యవహరిస్తారు. అలాగే పక్కవారినే ఏడిపించే వారంటే వీరికి వెంటనే కోపం వస్తుంది. కొత్త వారితో స్నేహం చేయడానికి ఇష్టపడే మనస్తత్వం వీరిది.
9.సెప్టెంబర్
ఈ నెలలో జన్మించిన పిల్లలు ఏ పనిచేసినా చాలా పర్ఫెక్ట్ గా మరియు జాగ్రత్తగా చేస్తారు.పెంపుడు జంతువులకు ఏమైనా ఇబ్బంది కలిగితే అస్సలు తట్టుకోలేరు. వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం, కొత్త కొత్త ప్రదేశాలను చూడటానికి ఉత్సాహంగా ఉంటారు. ఇతరులు కష్టంలో ఉంటే తట్టుకోలేని గొప్ప హృదయం వీరిది. అలాగే తమపై తామే జోక్స్ వేసుకుని ఇతరులను నవ్విస్తుంటారు.
10.అక్టోబర్
ఈ నెలలో జన్మించిన పిల్లలు మంచి ఏది? చెడు ఏది? అని నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ విషయమైనా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటారు. వీరు నడుచుకునే విధానం వలన ఇతరులు వీరితో త్వరగా స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అయితే వీరు తీసుకునే నిర్ణయాల పట్ల తల్లితండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
11.నవంబర్
నవంబర్ నెలలో జన్మించిన పిల్లలు ఏ విషయంలో అయినా ఆసక్తిగా ఉన్నారంటే అది సాధించేవరకు దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మాట్లాడరు. ఈ నెలలో పుట్టిన పిల్లలు చాలా అందంగా ఉంటారు. ఇతరులపై ఆధారపడటం వీరికి ఇష్టం ఉండదు. అలాగే కొత్త కొత్త రహస్యాలను ఛేదించడం అంటే చాలా ఇష్టం.
12.డిసెంబర్
ఈ నెలలో జన్మించిన వారు చాలా సంతోషంగా ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, కొత్త ప్రదేశాలకు వెళ్లడం అన్నా, అలాగే ఇతర సాంప్రదాయాలు వారి పద్ధతులు తెలుసుకోవడం అంటే ఇష్టం. అందరి పిల్లలలా కాకుండా స్కూల్ కు వెళ్లడం అంటే ఎటువంటి మారాం చేయరు. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు, ఇతరులతో పోటీపడుతుంటారు కానీ ఎవరైనా ఏమైనా అంటే మాత్రం తట్టుకోలేరు. సెన్సిటివ్ క్యారెక్టర్ కలిగిన వారు.
మీ పిల్లలు కూడా ఈ విధంగానే ఉంటున్నారా? ఇంకా కొత్తగా ఏమైనా చేస్తున్నారా? అటువంటి విషయాలను COMMENT చేసి మాతో పంచుకోగలరు. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే LIKE మరియు SHARE చేయండి.