మీరు గర్భంతో ఉన్నప్పుడు మీ భర్త నుండి కోరుకోవాల్సిన 5 విషయాలు

దాంపత్య జీవితంలో భార్య గర్భంతో ఉంది అనగానే ఇక భర్త ఎటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదనుకోకూడదు. 9 నెలల పాటు స్త్రీ బిడ్డను మోస్తే, ఆ తల్లికి తల్లి లోపల ఉన్న బిడ్డకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ఒక భర్తగా, తండ్రిగా మగవారికి ఉంది. గర్భంతో ఉన్నప్పుడు స్త్రీ తన భర్త నుండి ఆశించే ఆ 7 విషయాలు ఏంటో తెలుసుకుందాం..

1.అర్థం చేసుకోవడం

మీ భార్యను గర్భంతో ఉన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎందుకంటే ఆమెలో ఈ సమయంలో ఎన్నో మార్పులు కలుగుతాయి కాబట్టి.  హార్మోన్లలో మార్పులు, తీసుకునే ఆహారంలో మార్పులు, వివిధ రకాల ఫుడ్స్ తీసుకోవాలని పించడం వంటి కోరికలు కలుగుతూ ఉంటాయి అందువలన భర్త అది వద్దు ఇది వద్దు అని చెప్పకుండా తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆరోగ్యాన్నిచ్చే ఇచ్చే ఆహారానికి ఎటువంటి అడ్డంకులు చెప్పకూడదు.

2.ఎప్పుడూ పక్కనే ఉండాలి

తన భర్త నుండి భార్య ఆశించేది ఎక్కువగా ప్రేమ మరియు తనతో ఉండాలనుకోవడం. ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు తన భర్త ఎప్పుడు తనతో ఉండాలని, తన ప్రతిరోజూ అందంగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటుంది. గర్భం సమయంలో ఆమెలో కలిగే మార్పులననుసరించి వారితో గడపడం చేయాలి.

3.సహనంగా ఉండాలి

ఒక తెలియని వ్యక్తికి ఏదైనా కష్టం వస్తేనే మనం అందరిలో తెలియని బాధ కలుగుతుంది. అటువంటిది మీతో పాటు ఉండే మీ భార్య ఒక బిడ్డను తన శక్తినంతా కూడగట్టుకుని కొత్త ప్రపంచంలోకి తీసుకువస్తుంది కాబట్టి ఆమెతో ఎంతో సహనంగా ఉండాలి. ఒక వైద్యుడు రోగిని ఏ విధంగా ప్రేమగా చూస్తాడో అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతి భార్య తన భర్త నుండి ఆశిస్తుంది.

4.సన్నిహితంగా ఉండాలని కోరుకోవడం

గర్భంతో ఉన్న స్త్రీ ఎప్పుడు తన భర్త తన పక్కనే ఉండాలని ఏ విధంగా అయితే కోరుకుంటుందో అదే విధంగా ఈ సమయంలో రతి పట్ల ఆమెలో కోరికలు కలుగుతూ ఉంటాయి. భార్య కోరికలను అర్థం చేసుకుని ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ ఆమె కోరికలను తీర్చాలి. ఈ సమయంలో ఈ విధంగా చేయడం ఆమెకు మంచిదే కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

5.ప్రోత్సహించాలి

ఒక బిడ్డకు జన్మను ఇవ్వడం అనేది అంత సులభతరమైన పని కాదు. అంత ఓపికగా, అంత ధైర్యంగా ఉండటం ఒక్క స్త్రీ మూర్తికే సాధ్యం కాబట్టి ఆమెను ఎప్పటికప్పుడు ప్రోత్సహించడం, ఆమెకు మరింత ధైర్యాన్ని ఇస్తూ ఉండటం చేయాలి. అలాగే నువ్వు ఒక గొప్ప తల్లివి కాబోతున్నానని,మన బిడ్డను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నావని వారికి వెన్నుదన్నుగా నిలవాలి. ఈ విధంగా చేయడం వలన వారికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉండగలరు.

6.వ్యూహాత్మకంగా వ్యవహరించాలి

గర్భంతో ఉన్నప్పుడు స్త్రీకి ఎక్కడలేని భయాందోళనలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు వారికి తోడుగా ఉండటమే కాకుండా రెగ్యులర్ చెకప్ కు తీసుకెళ్తూ ఉండటం, బయటకు తీసుకెళ్తూ ఉండటం, వారితో ప్రేమగా మాట్లాడటం, పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెడదాం, బట్టలు, బొమ్మలు వంటివి కొనుగోలు చేయడం వలన వారి భయాందోళనలను కొంచెం అయినా తగ్గించవచ్చు.

7. సపోర్ట్ గా ఉండటం

స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు తను ఎక్కువగా భర్త  అండనే కోరుకుంటుంది. అమ్మా,నాన్న, అన్నయ్య..ఇలా ఆత్మీయులు ఎంతమంది ఉన్నా సరే తనకు సపోర్ట్ గా ఉండాల్సింది తన ఆహారపు వ్యవహారం తన ఆరోగ్యాన్ని తన భర్తే బాగా చూసుకోగలడు అని భర్తను మాత్రమే బాగా నమ్ముతుంది కాబట్టి వారికి సపోర్ట్ గా ఉండటం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే LIKE చేయండి SHARE చేయండి. విషయాలు తెలుసుకోవడానికి COMMENT చేయగలరు.

ఇవి కూడా చదవండి.

అమ్మ ఇంట్లో లేకపోతే నాన్న పిల్లలతో కలిసి చేసే పనులు ఇవి….: నవ్వడం అప్పుకోలేరు…

Leave a Reply

%d bloggers like this: