అప్పుడే పుట్టిన పిల్లలతో ఎప్పుడు చేయకూడని 6 పనులు : ఇలా చేస్తే చాలా ప్రమాదం..

9 నెలలు ప్రాణంగా కడుపులో కాపాడుకున్న, బిడ్డ బయటకు వచ్చేసాడు. పుట్టిన పిల్లలు, ఆ ఇంటికి కుటుంబానికి, ఎప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొస్తారు. మన బాధ్యత పెరుగుతుంది. కానీ ఆ బాధ్యతల్లో పుట్టిన పిల్లల కోసం ఏమి చేయాలో కన్నా వారితో ఏమి చేయకూడదో తెలుసుకోవడం చాలా అవసరం. పుట్టిన పిల్లలకు ప్రమాదమైన, చేయకూడని పనులు ఏంటో చూడండి…

1. ఎవరిని ముద్దు పెట్టుకోనివ్వదు

అప్పుడే పుట్టిన పిల్లలలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. రోగాల నుండి కాపాడుకోలేదు. పుట్టిన పిల్లలను ముద్దు పెట్టుకోవడం వలన నోటి ద్వారా బాక్టీరియా వారిలోకి ప్రవేశించచ్చు. రోగాలకు కారణం కావచ్చు.

2. డైపర్స్ మార్చకుండా ఉండడం

అప్పుడే పుట్టిన పిల్లలుకు ఎక్కువ మూత్రం వస్తుంది. అందుకే డైపర్స్ వాడడం ఎలానో తప్పదు. కానీ తడి డైపర్స్ ని వెంటనే మార్చేయండి. ఒకవేళ తడి ఎక్కువ సేపు అలానే ఉంటే, అది పిల్లలలోకి చేరుతుంది. చర్మ సమస్యలను కూడా కలిగిస్తుంది.

3. చేతులు కడగండి

పిల్లలను ఎత్తుకునే ముందు తప్పకుండా చేతులను కడుక్కోవడం మర్చిపోకండి. చేతుల్లో వుండే అనేక రకాల బాక్టీరియా, వైరస్ పిల్లలకు వ్యాపిస్తాయి. రోగాలకు కారణం అవుతాయి.

4. గట్టిగా పట్టుకోవడం

పిల్లలను ఎత్తుకోవడం, లేపడం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే వారి శరీరం, ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే ఎత్తుకునేటప్పుడు చాలా నిదానంగా ఉండాలి.

5. బిగుతైన బట్టలు

పిల్లలకు ఎప్పుడైనా గాలి తగిలేలా వదులైన బట్టలు మాత్రమే తొడగాలి. బిగుతైన బట్టలు వేయడం వలన జ్వరం, డీ-హైడ్రేషన్ కు గురవుతారు. 

Leave a Reply

%d bloggers like this: