ఒకప్పుడు పెళ్లి అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసుకుని ఇద్దరినీ ఒక్కటి చేసేవారు. జాతకాలు కలిశాయా?లేదా? ఇద్దరి భవిష్యత్ ఎలా ఉండబోతుంది అని హస్తరేఖలు చూడటం జరిగేది. కానీ ఇప్పుడలా కాదు రెండు మనసులు కలిస్తే ప్రేమగా మారి పెళ్ళికి దారితీస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ రాశుల వారు వివాహం చేసుకోవడం వలన దాంపత్య జీవితం మరింత ఆనందంగా ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏంటో మీరే చూడండి.
మేష రాశి (మార్చి 21-ఏప్రిల్ 19)
మేష రాశి వారు అగ్నిలాంటి వారైతే వారికి గాలిలాంటి తుల రాశి తోడైతే ఇద్దరి జీవితం మరింత దృఢంగా ఉంటుందని చెబుతున్నారు. వీరు ఏం చెప్పలనుకున్నా మనసులో ఏది పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేతత్త్వం కాబట్టి ఇద్దరికీ సరిపోతుంది.
వృషభం (ఏప్రిల్ 20-మే 20)
సాధారణంగా వృషభం మరియు వృశ్చికం బలమైన ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ రెండు రాశులు వ్యతిరేక సంకేతాలు కలిగి ఉండటం వలన అవి తరచుగా నిరంతరాయంగా నిరంతరరేఖ వంటి ముగింపుతో ప్రారంభమవుతాయి.
మిధునం (మే 21-జూన్ 20)
సహజంగా మిధునం రాశి వారు చాలా ప్రతిభావంతులు. ఈ ప్రపంచాన్ని ఎవరూ బాగా పరిపాలించగలరు అని ఆలోచిస్తూ అటువంటివారే తనకు భాగస్వామి కావాలని కోరుకుంటారు. వీరికి ధనుస్సు రాశి వారు జీవితంలోకి వస్తే ఇద్దరూ ఒకటై ప్రపంచాన్ని ఏలగల శక్తి సామర్థ్యం వీరిసొంతం.
కర్కాటక రాశి (జూన్ 21-జులై 20)
కర్కాటక రాశి వారి మనస్సును మీనం రాశి వారు బాగా అర్థం చేసుకోగలరు. ఉద్వేగపరిస్థితుల్లోనూ, భావోద్వేగాల పరిస్థితుల్లోనూ ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకుని వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు.
సింహ రాశి (జులై 23-ఆగస్టు 22)
ఒక రాశి వారు మరొక రాశి వారితో పోటీపడేలా, వారి ఆలోచనలకు దగ్గరగా ఉంటే వారిద్దరి మధ్య బలం మరింత దృఢంగా ఉంటుంది. అలా సింహరాశి అగ్నితో సమానం అయితే అందుకు తగ్గ రాశి ఏదైనా ఉందా అంటే అది కుంభ రాశి అని చెప్పవచ్చు.
కన్య రాశి (ఆగస్ట్23-సెప్టెంబర్ 22)
కన్య రాశి భూమితో పోల్చితే, భూమితో కలిసి స్నేహంగా, ప్రేమగా ఉండేవి కర్కాటకం, వృశ్చికం మరియు మీనం రాశులు. కన్య రాశితో ఈ మూడింటిలో ఏది ముడిపడినా వాటిమధ్య ఎంతో సంతోషం, ప్రేమ ఉంటాయి.
తులా రాశి (సెప్టెంబర్ 23-అక్టోబర్ 22)
అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా చూసినా ఒకే విధంగా కనిపిస్తాయో తులా మరియు మేషం రాశులను చూసుకుంటే ఒకే విధంగా ఆలోచించడం, నవ్వడం, కలిసిపోవడం అనేవి సమతుల్యంగా ఉంటాయి.
వృశ్చికం (అక్టోబర్ 23-నవంబర్ 21)
వృశ్చికం రాశి వారికి వృషభం మంచి పెయిర్ గా చెప్పుకోవచ్చు. ఈ రెండు రాశుల వారు ఆర్ధిక మరియు భావోద్వేగాలపై దృష్టి సారిస్తారు. ఒక బంధం దృఢంగా ఉండాలన్నా, ఎక్కువ రోజులు నిలవాలన్నా అందుకు పునాది సరైనదిగా ఉండాలనుకుని ఏ విషయాలు దాచుకోకుండా చెప్పుకుంటారు.
ధనుస్సు రాశి (నవంబర్ 22-డిసెంబర్ 21)
నిజానికి ధనుస్సు రాశి, మిధున రాశి రెండు వ్యతిరేక ధృవాలు కలిగి ఉన్నా, ఈ రెండు రాశుల వారికి తమనితాము ఉన్నతంగా చూసుకోవాలని, తమ ప్రతిభ గురించి అందరికీ తెలియాలని కోవడమే ఇద్దరినీ ఒకటి చేస్తోంది.
మకర రాశి (డిసెంబర్ 22-జనవరి 19)
మకరం మరియు వృషభం రాశులకు ఆలోచనల పరంగా, వ్యక్తిగతంగా ఒకే విధమైన ఆలోచనలు ఉన్నాయి. ఎప్పుడూ తనతో ఉన్న మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటారు.
కుంభ రాశి (జనవరి 20-ఫిబ్రవరి 18)
మాకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు కుంభ రాశి మరియు సింహ రాశి ఒకటవ్వడం మంచిది. సాధారణంగా ఈ రెండు వ్యతిరేక ధృవాలు. కానీ వీరి ఆలోచనలు, ఇష్టమే ఇద్దరినీ మరింత దగ్గరికి చేస్తుంది.
మీనం (ఫిబ్రవరి 19-మార్చి 20)
మీనం రాశి సరైన రాశి అంటే కర్కాటకం అని చెప్పాలి. ఈ రెండు రాశులు చాలా సెన్సిటివ్ మరియు ఎమోషనల్ గా ఉంటారు. ఈ గుణాలే వీరి మధ్య బంధం మరింత బలపడేలా చేస్తాయి.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
పుట్టిన రాశిని బట్టి మీరు ఎలాంటి అమ్మ అవుతారో వెంటనే తెలుసుకోండి!!