ఏ వయసులో అయినా ప్రగ్నెంట్ అవ్వచ్చా? ప్రగ్నెన్సీకి వయసుకు సంబంధం తెలుసుకోండి

మహిళలలో పది సంవత్సరాలకు ఒకసారి తమ శరీరంలో కొన్నిమార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఏ వయసులో గర్భం దాల్చడం కరెక్ట్ అనేది ఎవరు చెప్పలేదు కానీ ఇక్కడ చెప్పుకునే వయసులలో గర్భం దాల్చడం వలన కలిగే లాభాలు మరియు నష్టాల గురించి వివరంగా మేము మీకు తెలుపుతున్నాం.

మహిళలు యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండగలుతుతారు. బిడ్డను బాగా చూసుకోగల శక్తి కూడా ఉంటుంది.  అయితే ఈ వయసులో సరిపడినంత డబ్బు ఉండదు కాబట్టి బిడ్డను బాగా చూసుకోలేరు. అదే వయసు పెరిగిన తర్వాత బిడ్డకు జన్మను ఇవ్వడం వలన మీ దగ్గర కావలసినంత డబ్బు ఉంటుంది ఎలా చూసుకోవాలి అనే ఆలోచనా కూడా ఉంటుంది కానీ వయసు పెరిగే కొద్దీ తగినంత శక్తి ఉండకపోవడం వలన బిడ్డ పెరుగుదల మరియు అభివృద్ధిలో వెనుకబడటం జరుగుతుంది.

20 నుండి 24 ఏళ్ళ వయసులో :

మీ ఫిజిక్

ఈ వయసులో మహిళలు చాలా ఫిజిక్ గా శక్తివంతంగా ఉండగలరు. రుతుక్రమం మరియు పునరుత్పాదక సామర్థ్యం కూడా ఉంటుంది.  ఈ సంవత్సరాల పరిధిలో మహిళలు సులభంగా గర్భం దాల్చగలరు.

మీ భావోద్వేగాలు

ఈ వయసులో చాలామంది మహిళలు వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉంటారు. ఎందుకంటే తమ భవిష్యత్ ను చక్కని దారిలో పెట్టుకోవడానికి, ఉన్నతంగా జీవించడానికి ఇష్టపడతారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా, సామజిక ఒత్తిడుల వలన తక్కువ వయసులోనే వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ వయసులో తల్లి అయినా కూడా కొందరు ఆనందాన్ని పొందలేరు.

ప్రమాదకరం

20 నుండి 24 సంవత్సరాల వరకు, గర్భస్రావం ప్రమాదం మహిళల్లో 9.5% ఉంటుంది. మీ గుడ్లు ఇంకా చిన్నవి మరియు ఆరోగ్యకరమైన పిల్లలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి, పిల్లలలో వైకల్యం యొక్క సంభావ్యత కూడా తక్కువగా ఉంటుంది.

25 నుండి 29 ఏళ్ళ వయసులో :

మీ ఫిజిక్

ఈ వయసులో మీరు సరైన వ్యాయామాలు చేయడం, పౌష్టిక ఆహారం తీసుకోవడం వలన గర్భధారణ సమయంలో ప్రసవం సాధారణంగా జరుగుతుంది. అలాగే బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ మునుపటి ఫిజిక్ ను పొందటానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఈ వయసులో ప్రసవం జరగడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ ను నివారించవచ్చు.

మీ భావోద్వేగాలు

ఈ వయసులో బిడ్డకు జన్నను ఇవ్వడం వలన వారిని ఎలా చూసుకోవాలి వారితో ఎలా గడపాలి వారి ఎదుగుదల ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలను మీరు బాగా అర్థం చేసుకోగలరు.

30 నుండి 34 ఏళ్ళ వయసులో :

మీ ఫిజిక్

30 సంవత్సరాల వయసులో మహిళలలో పునరుత్పత్తి మరియు సంతానోత్పత్తి తగ్గిపోతుంది. అదే సంతానోత్పత్తి చికిత్సకు మీరుయ్ సిద్ధమైతే 35 ఏళ్ళ వయసు పైబడ్డ తర్వాత కూడా తల్లి కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

భావొద్వేకంగా పరిపక్వత ఎక్కువ

ఈ వయసులో గర్భం దాల్చిన వారు తమ యుక్త వయసులో పనిలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు కాబట్టి ఎటువంటి సమస్యనైనా సరే సులభంగా సాల్వ్ చేసుకోగలరు మరియు బిడ్డతో ఎక్కువ సమయం గడపడానికి వారికి సమయం ఉంటుంది. అలాగే పిల్లలపట్ల చాలా బాధ్యతగా వ్యవహరించగలుగుతారు. వారికి ఏది మంచిది ఏది కరెక్ట్ కాదు అనే విషయాలను బాగా తెలుసుకోగలరు. ఈ వయసులో మళ్ళీ ఆఫీస్ కు వెళ్లి పని చేయడానికి, ఇంకా ఏదైనా పని చేయడానికైనా త్వరగా వెళ్ళగలరు.

35 నుండి 39 ఏళ్ళ వయసులో :

ఈ వయసులో చాలావరకు పునరుత్పత్తి తగ్గిపోతుంది. గర్భం దాల్చడం బిడ్డకు జన్మను ఇవ్వడం అంటే చాలా కష్టతరమైన పని కూడా. ఎందుకంటే ఈ వయసులో పిండాన్ని వృద్ధి చేసే కణాలు తగ్గిపోతూ ఉంటాయి. ఒకానొక దశలో పూర్తిగా అంతరించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పునరుత్పత్తి మరియు సంతానోత్పత్తి కావడానికి ఈ వయసులో చాలా కష్టంతో కూడుకున్న పని.

35 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్నపుడు ఇంకా గర్భం దాల్చకపోయి ఉంటే మీ భర్తతో క్రమం తప్పకుండా ఒక సంవత్సరం పాటు రతిలో పాల్గొంటూ ఆనందాన్ని పొందడం వలన గర్భధారణను పొందే అవకాశం ఉంది. అదే 35 ఏళ్ళ వయసు పైబడ్డ వారు క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు శృంగారంలో పాల్గొంటే సంతానోత్పత్తి పొందడానికి వీలుగా ఉంటుంది.

35 నుండి 39 ఏళ్ళ వయసులో బిడ్డకు జన్మను ఇవ్వడం వలన బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారిలో మూడురెట్లు అధికంగా ఉంటుంది. అలాగే బిడ్డ జన్మలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ వయసులో చాలావరకు బిడ్డకు జన్నను ఇవ్వడం అంటే రిస్క్ తో కూడుకున్న విషయమే అని అంటున్నారు వైద్యులు.

ఈ వయసులో ప్రసవం జరిగితే జన్యుపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే కవల పిల్లలు లేదా ముగ్గురు పిల్లలు జన్మించే అవకాశం కూడా ఉంటుంది. మహిళల అండాశయంలో రెండు గుడ్లు అలాగే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు .

40 ఏళ్ళ తర్వాత

40 సంవత్సరాలు లేదా ఆ పైన వయసు ఉన్నవారు కొన్ని రకాల మందులను వాడటం వలన గర్భం దాల్చగలరు. అయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది తల్లి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. తల్లి ఆరోగ్యంగా ఉండటం వలన పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే ఇదివరకే ఒక బిడ్డకు జన్మను ఇచ్చి మళ్ళీ ఈ వయసులో గర్భం దాల్చడం వలన కడుపునొప్పి సమస్యలు, హెమరాయిడ్, బ్లాడర్ సమస్యలతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.

మరి పైన చెప్పుకున్న విషయాలను బట్టి మహిళ గర్భం దాల్చడానికి బిడ్డకు జన్మను ఇవ్వడానికి సరైన సమయం  ఏది అంటే 20 ఏళ్ళ తర్వాత మరియు 30 ఏళ్ళ వరకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ ముఖ్యమైన ఆర్టికల్ ను అందరితో SHARE చేసుకోండి. మీకు నచ్చినట్లయితే LIKE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి COMMENT చేయగలరు. 

Leave a Reply

%d bloggers like this: