గర్భంలో ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు తంతారో తెలుసా..!

బిడ్డకు జన్మను ఇచ్చిన ప్రతి తల్లికీ, గర్భంతో ఉన్న ప్రతి మహిళకు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పసి పిల్ల తన్నుతూ ఉంటారు.  ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? పిల్లలు ఈ విధంగా చేయడానికి అసలు కారణం ఏంటో? వివరంగా తెలుసుకుందాం..

తల్లి గర్భంలో ఉన్న పసిపిల్లలు తన్నుతూ ఉంటే తల్లి ఎంత ఆనందపడుతుందో మాటల్లో చెప్పలేం. అది ఒక్క తల్లికి మాత్రమే తెలుసు. అయితే పసిపిల్లలు తల్లిని కడుపులో ఎందుకు తన్నుతారు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

తల్లి గర్భంలో పసిపిల్లలు తన్నుతూ ఉన్నారంటే బిడ్డ ఆరోగ్యంగా ఉందని గమనించాలి. బిడ్డ ఆరోగ్యస్థితిని తెలియజేయడానికి ఇది ఒక సూచిక. అలాగే బిడ్డ తన్నడం చేయలేదంటే అనారోగ్యంగా ఉందని తెలుసుకోవాలి.

చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. గర్భిణీగా మహిళలు టీవీ చూస్తున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు ఏవైనా శబ్దాలు వినిపిస్తే వారికి వినిపిస్తాయని తెలిసే ఉంటుంది. పిల్లలకు ఆ శబ్దాలు వినిపించడం వలన తల్లి కడుపులో తన్నడం చేస్తూ ఉంటారు.

తల్లి కడుపులో బిడ్డ పడిన 9 వారాలున్నప్పుడు తన్నడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కొన్ని వారాల పాటు ఇలా  చేయడం ఆపివేస్తాడు.  ఆ తర్వాత మళ్ళీ 13 వారాల నుండి తన్నడం మొదలుపెడతారని వైద్యులు చెబుతున్నారు. అలాగే తల్లి ఎడమవైపుకు తిరిగి పడుకున్నప్పడు రక్త సరఫరా బాగా జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో కూడా తన్నడం చేస్తూ ఉంటాడు. పైన చెప్పుకున్న దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బిడ్డ తన్నడం చేయడం వలన బిడ్డ ఆరోగ్యానికి మంచిదే అని గుర్తించాలి మరియు ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకూడదు కూడా.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు. 

Leave a Reply

%d bloggers like this: