గర్భవతులు డాక్టర్‌ను తప్పకుండా అడగాల్సిన 7 ప్రశ్నలు

ప్రెగ్నెన్సీ అనే ప్రక్రియ చాలా భిన్నమైనది మరియూ దీని గురించి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి.  ప్రెగ్నెన్సీ గురింబ్చి మహిళలకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వారు వైద్యున్ని అడగవచ్చు. అవేంటంటే,

1.తిమ్మిరి లేక బ్లీడింగ్

ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి మూడు నెలల్లో ఒక్కోసారి యుటెరస్ భాగంలో తిమ్మిరిగా ఉండటం లేదా బ్లీడ్ అవ్వడం జరుగుతుంది.  ఇది అలాగే కొనసాగితే వైద్యున్ని సంప్రదించడం మంచిది. ఒక్కోసరి ఇంఫెక్షన్ వల్ల కూడా ఇలా జరగవచ్చు.

2.ఎంత బరువు ఉండవచ్చు

ప్రెగ్నెన్సీ మహిళలకు వచ్చే సందేహాలలో బరువు కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు కొలవడానికి బాడీ మాస్ ఇండెక్స్ అనే దాన్ని వాడుతారు. దీని ప్రకారం

-బిఎంఐ 18.5 కన్నా తక్కువ ఉంటే బరువు తక్కువగా ఉన్నట్లు,

-బియంఐ 18.5 నుండి 25 వరకు ఉండే మధ్యస్థంగా ఉన్నట్లు,

-బియంఐ 25 నుండి 30 మధ్యలో ఉంటే ఎక్కువ బరువు ఉన్నట్లు,

-బియంఐ 30 కన్నా ఎక్కువ ఉంటే స్థూలకాయం ఉన్నట్లు చెప్తారు.

3.ఎలాంటి వ్యాయామాలు చేయాలి

వ్యాయామం చేయడం వల్ల సాధారణ కాన్‌పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టీ వ్యాయామం చేయడం చాలా మంచిది. కొంచెం సేపు వాకింగ్, వీలైతే స్విమ్మింగ్, యోగా చేయడం మంచిది. మరీ కష్టంగా ఉండే వ్యాయామాలు చేయకపోవడం మంచిది. ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.

4.ఎప్పటి వరకు పని చేయవచ్చు

పని చేయవచ్చా లేద అన్నది మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ ఒత్తిడికి గురి కాకపోతే చివరి నెల వరకు పని చేయవచ్చు. ఒకవేల మీకు ఎక్కువ ఒత్తిడి అనిపిస్తే అపేయడం మంచిది. భౌతికమైన పని అయితే చేయకపోవడం మంచిది. అయితే మీ స్థితిని బట్టి కరెక్ట్‌గా కనుక్కోవాలంటే డాక్టర్‌ను సంప్రదించండి.

5.బర్త్ ప్లాన్ గురించి

నిజం చెప్పాలంటే మీకు బర్త్ ప్లాన్ అవసరం ఉండదు. కానీ కొంతమంది మహిళలు ప్రసవం ఇలానే జరగాలని అనుకుంటారు. అలాంటి సమయంలో డాక్టర్‌ను కలిసి అందులో ఉండే ఇబ్బందుల గురించి వెసులుబాట్ల గురించి తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది.

6.ప్రసవం జరిగేటప్పుడు ఎలా ఉంటుంది

మీరు ఆసుపత్రిలో ఉంటే ఒకలా ఇంటిలోనే జరిగితే ఇంకోలా ఉంటుంది. ఆసుపత్రిలో జరిగితే నర్సులు, డాక్టర్లు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటారు. మీ బిడ్డ పరిస్థితి గురించి వారు కేర్ తీసుకుంటూ ఉంటారు. మీ హెల్త్‌కు సంబంధించి అన్ని విషయాలనూ వారు జాగ్రత్తగా చుసుకుంటారు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు.

7.సిజేరియన్‌

ప్రతి ముగ్గురిలో ఒకరు సిజేరియన్‌కు వెల్తారని గణాంకాలు చెప్తున్నాయి.  అయితే ఇది ఒక్కోక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి మీ బిడ్డ పరిస్థితిని బట్టీ మీరు సిజేరియన్‌కు వెళ్ళవచ్చో లేదో డాక్టర్లు చెప్తారు. అందులో రిస్క్‌ను బట్టి మీరు అందరిలాగే సాధారణ కాంపునే కోరవచ్చు.

ఇవే కాక మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వైద్యున్ని/వైద్యురాలిని సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.

Leave a Reply

%d bloggers like this: