తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు బరువు పెరగాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తల్లి కడుపులో 9 నెలలు ఉండి ప్రసవం తర్వాత శిశువు జన్మిస్తే ఆరోగ్యంగా బలంగా ఉంటారు. అలా కాకుండా నెలలు నిండకుండానే జన్మించడం వలన  బరువు తక్కువగా ఉండటం, బలహీనంగా ఉండటం జరుగుతుంది. పిల్లలు తక్కువ బరువుతో పుట్టకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను ఎలా ట్రీట్ చేయాలో వివరంగా తెలుసుకోండి.

బరువు పెరగకుండా చూసుకోవాలి?

సాధారణంగా పుట్టబోయే బిడ్డ 2 కిలోల కంటే ఎక్కువ బరువుతో పుడితే శిశువు ఎదుగులదలకు బాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. అంతకంటే తక్కువగా అంటే 1.75 నుండి 2 కిలోల బరువు ఉండే పిల్లలలో భవిష్యత్ లో కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అధిక బరువు పెరగడం వలన అది కిడ్నీలపై ప్రభావం చూపుతుందని, అందుకని నెలలు నిండకుండా పుట్టిన బిడ్డను ఇన్ క్యుబేటర్ వంటి సాధనాలలో ఉంచి వీనింగ్ ఇవ్వడం వలన బరువు పెరుగుతారు.

ఆక్సిజన్

తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు హాస్పిటల్ లో సరిగ్గా ఆక్సిజన్ మరియు ఉష్ణోగ్రత అందేలా చూసుకోవాలి.

తాకకూడదు

పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో ఉన్నప్పుడే కాకుండా, నెలలు నిండిన తర్వాత ప్రసవించిన పిల్లలను అయినా సరే ఎవరూ ఎక్కువగా తాకకూడదు. మరీ ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టిన శిశువుని. ఎందుకంటే రోగ నిరోధక శక్తి వీరిలో చాలా తక్కువగా ఉండటం వలన శరీరానికి ఇన్ఫెక్షన్స్ త్వరగా వ్యాపిస్తాయి.

టీకాలు

తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు టీకాలు వేయించడంలో అశ్రద్ధ చేయించకూడదు. అలాగే ఎప్పుడు మెత్తటి బట్టతో బిడ్డను చుట్టి తల్లి పక్కనే పడుకోబెట్టాలి.

2.5 కేజీలు వచ్చేవరకు

బిడ్డ 2 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటే ఇబ్బంది ఉండదు కానీ అంతకంటే తక్కువగా ఉంటే వ్యాధులు సోకే ప్రమాదం ఉంది కాబట్టి 2.5కేజీల బరువు పెరిగే వరకు అంటుసోకకుండా జాగ్రత్తగా ఉండటం, బిడ్డ ఉండే గది ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

మాంసాహారం

బరువు తక్కువగా పుట్టిన పిల్లలు పెద్దయ్యాక మాంసాహారం ఎక్కువగా తినడం, ఆల్కహాల్, పొగతాగడం వలన కిడ్నీలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

ఒత్తిడి

ప్రస్తుత రోజుల్లో గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వటం, బీపీ కారణంగా గర్భస్థ శిశువుపై ప్రభావం  పడి బిడ్డ ఎదుగులకు ఆటంకంగా మారుతుంది.

ఆలస్యంగా పెళ్లి

కొందరు లేట్ గా వివాహం చేసుకుంటూ ఉంటారు. పిల్లలు తక్కువ బరువుతో పుట్టడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

ధూమపానం మద్యపానం

ఈ అలవాట్లు గర్భిణీలో ఉండటం వలన బిడ్డ తక్కువ బరువుతో పుట్టడానికి కారణం. అలాగే రక్తహీనత వలన బిడ్డ తక్కువతో పుడతారు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.  

తల్లి పాలు తగ్గడానికి కారణాలు ఇవే..తల్లి పాలు వృద్ధి చెందటానికి ఇంటి చిట్కాలు

Leave a Reply

%d bloggers like this: