పసిపిల్లలలో వచ్చే ప్రమాదకర చర్మ సమస్యలు, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం..రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లల శరీరానికి వ్యాధులు, అంటువ్యాధులు త్వరగా వస్తుంటాయి. ఎందుకంటే పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన మరియు చర్మ వ్యాధులు ఏర్పడటానికి పిల్లల చర్మం అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా పిల్లలలో వచ్చే చర్మ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

చికెన్ పాక్స్

ఈ చర్మ వ్యాధినే ఆటలమ్మ అని కూడా పిలుస్తారు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ఆకలి వేయకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. చర్మం పగిలిపోయి, చిన్న చిన్న బొడిపెలుగా, ఎర్రటి పగుళ్లుగా ద్రవంతో నిండిపోయి ఉంటుంది. పిల్లలలో ఈ వ్యాధి వచ్చినప్పుడు దురద కలుగుతుంది. ఆకలి ఈ సమయంలో ఉండదు కాబట్టి పిల్లల శరీరం డీ హైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి.

న్యాపీ రాష్

వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకని న్యాపీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంట్లో ఉన్నంతవరకు వాటిని వేయకపోవడం చేయాలి. ఒకవేళ వేస్తే 2 గంటలకు ఒకసారి వీటిని మారుస్తూ ఉండాలి. న్యాపీలు ఎక్కువగా వేయడం వలన ఉక్కపోత పెరిగి రాషెస్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే లో దుస్తులు  వేయకూడదు.

తామర

మెడపై, తొడలు, చేతి గజ్జలలో పగుళ్లు, దద్దుర్లుగా ఏర్పడి ఎర్రగా ఉండి చర్మంపై మంటను కలిగిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి రక్తం కూడా కారుతుంటుంది కాబట్టి దుస్తులు బాగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా స్నానం చేయించడం చేయాలి.

అమ్మవారు (తట్టు)

పిల్లల శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నోటిలో తెల్లని మచ్చలు, గొంతులో నొప్పిగా ఉండటం, ఎప్పుడు ముక్కునుండి నీరు కారుతూ ఉండటం, దగ్గుతూ ఉన్నట్లుగా ఉంటే అమ్మవారుగా గుర్తించాలి. వైరస్ ప్రభావం కారణంగా వచ్చే ఈ వ్యాధి వలన శరీరంపై మొటిమల సైజులో దద్దుర్లుగా ఉంటాయి. ఈ ప్రభావం ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

చెమటలు

వేసవి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పుండ్లుగా ఏర్పడి మంటలుగా ఉండటం జరుగుతుంది. నొప్పి పెద్దగా ఉండకపోయినా దద్దుర్లుగా ఉండటంతో పిల్లలు అసహనంగా ఉంటారు. కొన్ని బేబీ పౌడర్లు వీటికోసం మార్కెట్ లో ఉన్నాయి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా,  ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

బ్రెస్ట్ ఫీడింగ్: పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు తినకూడని 5 ప్రమాదకరమైన ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: