పసిపిల్లలు పాలు ఎందుకు వాంతి చేసుకుంటారు? ఆపడానికి చిట్కాలు

పసిపిల్లలు వాంతులు చేసుకోవడం సాధారణమే. ఒక్కోసారి పాలు వాంతికి చేసుకోవడం, ఆహారం వాంతి చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఈ విధంగా చేసుకోవడం సాధారణమే అయినా అసలు ఈ విధంగా పిల్లలలో జరగడానికి అసలు కారణం ఏమిటి? పిల్లలు వాంతి చేసుకోకుండా ఎటువంటి చిట్కాలను పాటించాలో తెలుసుకుందాం..

అనారోగ్యం

పసిపిల్లలు వాంతి చేసుకోవడానికి, పాలు కక్కడానికి కారణాలలో అనారోగ్యంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి.  తీసుకున్న ఆహారం  సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన, జ్వరం, కడుపునొప్పి వంటి అనారోగ్యం వలన పసిపిల్లలు వాంతి    చేసుకుంటూ ఉంటారు.

డయేరియా

తాజా ఆహారం తీసుకోనప్పుడు, పాలు వేగంగా తీసుకున్నప్పుడు, కడుపులో నులిపురుగుల సమస్య కారణంగా, కడుపునొప్పితో పాటు నీళ్ల విరేచనాలు కలిగి వాంతులు చేసుకోవడానికి కారణం. వీటివలన పిల్లల శరీరానికి మరిన్ని ఇన్ఫెక్షన్స్ చేరి కొత్త వ్యాధులకు దారితీస్తాయి కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా, పిల్లలు పాలు వేగంగా తాగకుండా చూసుకోవాలి.

చిన్నప్రేగు అభివృద్ధి చెందకపోవడం

పిల్లలు పుట్టినప్పుడు తల్లి గర్భంలోని ఉమ్మనీరు తాగడం వలన, చిన్న ప్రేగు అభివృద్ధి చెందకపోవడం వలన, కొన్ని రకాల మందులను తరచూ తల్లి, బిడ్డ తీసుకోవడం వలన పిల్లలు వాంతి చేసుకోవడానికి కారణాలు.

వాంతి చేసుకోకుండా ఏం చేయాలంటే

పసిపిల్లలున్న ప్రతి తల్లితండ్రులకు ఎదురయ్యే సమస్య పిల్లలు పాలు తాగిన తర్వాత వాంతి చేసుకోవడం, అలాగే ఆహారం తీసుకున్నప్పుడు వాంతి కావడం. ఇక నుండి పిల్లలు పాలు తాగిన తర్వాత వారికి తేన్పులు వచ్చేవరకు భుజంపై తట్టడం చేయాలి. ఈ విధంగా చేయడం వలన పిల్లలు వాంతి చేసుకోకుండా నివారించవచ్చు.

మందులు వాడకూడదు

పసిపిల్లలు వాంతులు చేసుకోకుండా ఉండటానికి కొన్ని రకాల మందులు లభ్యమవుతున్నాయి కానీ చిన్నతనంలోనే పిల్లలకు ఈ విధంగా మందులు వేయించడం వలన కొత్త రకాల వ్యాధులు రావడానికి ప్రమాదం ఉంది మరియు పిల్లల రెసిస్టన్స్ పవర్ ను తగ్గించివేస్తుంది.

పాల విషయంలో

పసిపిల్లలకు తల్లి పాలే ఆరోగ్యకరం అని అందరికీ తెలిసిందే. ఆరు నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వడం బిడ్డకు ఆరోగ్యకరం. అలా కాకుండా ఆవు పాలు లేదా పాల పౌడర్ తో చేసిన పాలను పిల్లలకు పట్టించడం వలన వారికి కడుపులో వికారం మొదలై వాంతులు రావడానికి కారణం అవుతాయి.

తరచూ ఆహారం తీసుకున్నప్పుడు లేదా పాలు తీసుకున్న తరవాత పిల్లలు వాంతి చేసుకుంటూ ఉంటే కడుపుకు ఎక్స్ రే చేయించడం చేయాలి. అలాగే ఈ విషయంలో వైద్యుల సలహా, పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి. 

సంవత్సరంలోపు పిల్లలకు తప్పకుండా తినిపించాల్సిన అద్భుతమైన 9 ఆహారాలు

Leave a Reply

%d bloggers like this: