పిల్లలకు జ్వరం వస్తే వెంటనే ఏమి చేయాలి? ఇంట్లోనే జ్వరాన్ని తగ్గించడానికి చిట్కాలు….

పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వారి శరీరానికి త్వరగా వ్యాధులు సోకుతుంటాయి. పిల్లలలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు నుండి ఎలా బయటపడాలో మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు.  అయితే ఎటువంటి మందులు వాడకుండా పిల్లలలో జ్వరం ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి.

ఆలివ్ ఆయిల్

పిల్లలలో అయినా, పెద్దలలో అయినా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన జ్వరం ఉంటుంది. ఆ ఉషోగ్రతను తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ ను శరీరానికి రాసి మసాజ్ చేయాలి. కాటన్ దుస్తులు మరియు పలుచటి వస్త్రం కప్పి పడుకోబెట్టాలి. రెండేళ్లలోపు పిల్లలకు ఈ విధంగా చేయవచ్చు.

కాళ్లకు సాక్స్

సాధారణం జ్వరం అయితే ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోతుంది. శరీర వేడి తగ్గడానికి కాటన్ సాక్స్ తీసుకుని చల్లని నీటిలో ఉంచి పాదాలకు తొడిగి విశ్రాంతి తీసుకోవడం వలన శరీర వేడి తగ్గుతుంది. సాక్స్ ఆరిన తర్వాత మళ్ళీ వేస్తూ ఉండాలి.

కలబంద రసం

కలబంద రసం లేదా జామ ఆకు నుండి తీసిన రసం తల నుదుటిపై రాయడం వలన శరీరవేడి తగ్గుతుంది.

వేడినీటితో స్నానం

గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం బాడీ ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. ఫలితంగా జ్వరం వెంటనే తగ్గుతుంది.

తేనె

ప్రతిరోజూ ఒక స్పూన్ తేనే పిల్లలకు ఇవ్వడం వలన రోగనిరోధక శక్తి పెరిగి జ్వరం,జలుబు,దగ్గు సమస్యలు ఉండవు.

తల మెడ భాగంలో

ఒక పలుచటి వస్త్రాన్ని తీసుకుని నీటిలో తడిపి తల, మెడ భాగంలో వేయడం వలన శరీరా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆరిన తర్వాత మళ్ళీ వేయడం చేయాలి.

నీరు

నీరు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు అని అందరికీ తెలిసిందే. పిల్లలకు ఎక్కువ నీటిని ద్రవ పదార్థాలను ఇవ్వడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

వేడి తగ్గడానికి

పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన జ్వరం ఉన్నప్పుడు చలి నుండి కాపాడటానికి మందంగా ఉన్న దుప్పట్లను కప్పడం చేయకూడదు. తేలికపాటి వస్త్రాలను కప్పడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

ఈ విధంగా చేయడం వలన జ్వరం నుండి త్వరగా బయటపడవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు వెంటనే మందులు ఇవ్వడం వలన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే సహజంగా ఎలా బయటపడాలో తెలుసుకోవడం, ఆ టిప్స్ పాటించడం పిల్లల ఆరోగ్యానికి మంచిది.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.   మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.  

పిల్లలకు ఎప్పుడూ తినిపించకూడని 10 ప్రమాదకరమైన ఆహారాలు 

Leave a Reply

%d bloggers like this: