పిల్లలు నోట్లో వేలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..! నోట్లో వేలు పెట్టుకోకుండా ఇలా చేయండి

శిశువు గర్భంలో ఉన్నప్పటి నుండి తమ బ్రొటనవేలును చీకుతూ ఉంటారు. ఆ అలవాటు బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగే  అవకాశం ఉంది. పిల్లలు తమలోని భావాలను ప్రదర్శించడానికి వేలును చీకుతారు. వారు భయపడినా, ఆనందపడినా, ఉలిక్కిపడినా వారు చేసే మొదటి పని వేలును నోట్లో పెట్టుకోవడం. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా వేలును నోట్లో పెట్టుకుంటారు. దీనిని బలవంతంగా ఆపకండి. ఒకవేళ మీరు వారిని ఫోర్స్ చేసి ఆపితే అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.  పైపెచ్చు పిల్లలు రెబల్‌గా మారే అవకాశం ఉంది.

ఇలా చేస్తే ఆపేస్తారు

వారు ఎప్పుడు వేలును నోట్లో పెట్టుకుంటారో గమనించాలి. ఒకవేళ టివి చూసేటప్పుడు అలా చేస్తుంటే, మీ బాబుకు బాల్ ఇచ్చి ఆడుకొనే విధంగా చేయాలి. నిద్రపోయేటప్పుడు ఆ విధంగా చేస్తుంటే ఏదైనా సాంగ్ లేదా కథ చెప్పడం వంటివి చేయాలి. ఇలా ఏదో ఒకటి చేస్తూ వారి చేతులకు పని చెప్పేలా ఉండాలి.

వయస్సు పెరగకముందే మాన్పించకపోతే

మీ బాబు వేలును నోట్లో పెట్టుకొనేటప్పుడు ఎంత తీవ్రతతో చేస్తున్నాడో గమనించండి. సాధారణంగా చిన్న వయసులో తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ తీవ్రత పెరుగుతుంది. కాబట్టి వారి వయసు 4 ఏళ్ళకు మించక ముందే ఈ అలవాటును మాంపించాలి.

పళ్ళ వరుస, దవడపై ప్రభావం

అయితే, శాశ్వతమైన దంతాలు వచ్చే లోపు మీ పిల్లల చేత చీకే అలవాటును మాంపించాలి. అప్పటికీ అలాగే కొనసాగితే వారి పళ్ళవరుసపై, దవడపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీకు తోచిన అన్ని విధాలూ ట్రై చేసి వారి చేత ఈ అలవాటును మాంపించడానికి ప్రయత్నం చేయండి.

ఎప్పుడు ఏం చేస్తున్నాడో గమనించాలి

వారి అలవాట్లను జాగ్రత్తగా గమనించడం ద్వారా మీరు ఈ అలవాటును సులభంగా మాంపించవచ్చు. బాబు ఏ సమయంలో అలా పెట్టుకుంటాడో తెలుసుకొని అదే సమయంలో వారికి ఏదైనా పని చెప్పాలి. అయితే మీరు ఈ అలవాటును మాంపించడానికి ఎట్టి పరిస్థితులలోనూ ఇబ్బందికర మార్గాలను అనుసరించకండి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

పిల్లలు పుట్టిన తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే…: ముందే తెలుసుకోండి

Leave a Reply

%d bloggers like this: