మనిషి మనుగడ సాగించడానికి బంధాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మంచి సంబంధాలు మెయిన్‌టెన్ చేసే వ్యక్తులు చాలా ఆనందంగా ఉంటారని, మంచి వైవాహిక జీవితం పొందగలరని, మంచి జీవితాన్ని కొనసాగించగలరని చెప్పడానికి ఎన్నో ఋజువులు ఉన్నాయి. అయితే, ఒక తల్లిగా మీరు కొన్నింటిని త్యాగం చేయాల్సి ఉంటుంది.
సంభోగం
మీరు తల్లి అయిన తర్వాత మిస్ అయ్యే వాటిలో మొదటిది మీ శృంగార జీవితం. మీరు బాబు/పాప కోసం మీ శృంగారం జీవితాన్ని తృణప్రాయంగా వదిలివేయాల్సి వస్తుంది. మీ బాబుకు సపర్యలు చేసేటప్పుడు మీకు ఎట్టి పరిస్థితులలోనూ రొమాన్స్ గుర్తు రాదు. మీ బాబే మీ ప్రపంచం అవుతారు.
ఎమోషనల్ రిలేషన్
మీరు తల్లి అయిన తర్వాత మీ భర్తతో ఎమోషనల్ రిలేషన్‌ను కోల్పోతారు. అయితే అది మీ తప్పు కాదు. ప్రసవం తర్వాత స్వతహాగానే కలిగే ఒత్తిడి వల్ల భార్యాభర్తల మధ్య కొంచెం దూరం పెరుగుతుంది. అయితే ఇది ఎక్కువ ఉండే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఎక్కువ బాధ, ఒత్తిడి, శృంగారం పట్ల అయిష్టత వంటివి ఉంటే వైద్యున్ని సంప్రదించాలి.
వృత్తిగత సంబంధాలు
మీరు తల్లిగా మారిన తర్వాత వృత్తిగత సంబంధాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మునుపటిలా మీరు మీ సహోద్యోగులతో కలిసి బయటకు వెళ్ళడాలు, కలిసి లంచ్ చేయడాలు ఉండవు. ఒకవేళ మీరు బయటకు వెళ్ళినా మీ ధ్యాస అంతా బేబీపైనే ఉంటుంది. ఇది ప్రతి తల్లికి సర్వసాధారణం.
పొసిసివ్‌నెస్
మీ బాబుకు సంబంధించి మీకు పొసెసివ్‌నెస్ బాగా పెరిగిపోతుంది. మీ బిడ్డను ఎవరైనా టచ్ చేస్తే మీరు తట్టుకోలేరు. శుభ్రత లేని వాళ్ళు టచ్ చేస్తే మీకు మరింత కోపం వచ్చే అవకాశం ఉంది. మీ అత్తమామల విషయంలో మీరు ఇలాంటివి చేసే అవకాశం ఉంది. కాబట్టి, మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, వారికి కూడా మీ బిడ్డ ఎంతో ప్రేమ ఉంటుంది.
సోషల్ రిలేషన్
మీకు బిడ్డ పుట్టాక సోషల్ రిలేషన్ చాలా తగ్గుతుంది. మీ బంధువుల్లోనో లేదా చుట్టుపక్కల ఇంట్లోనో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నా మీబిడ్డ కారణంగా మీరు వెళ్ళలేరు. దీంతో ఏదో మిస్ అయిన భావన మీకు కలుగుతుంది. అయితే, ఇవన్నీ కూడా మీకు కేవలం కొన్ని రోజులే ఉంటాయి. ఆ తర్వాత మీరు మునుపటి జీవితాన్ని తిరిగి కొనసాగించవచ్చు.