పిల్లలు పుట్టాక మీరు మళ్ళీ బలంగా కావడానికి, శక్తిని పెంచే 5 పనులు : తప్పక చేయాలి..

ప్రసవం తర్వాత రోగనిరోధక శక్తి చాలా మటుకు తగ్గిపోతుంది. దీంతో మీరు చిన్న చిన్న వైరస్‌లను కూడా డిఫెండ్ చేయలేరు.   మీ శరీరంలో వైట్ బ్లెడ్ సెల్స్ తగ్గిపోతాయి. దీంతో మీకు రోగాలు అటాక్ అయ్యే శాతం పది రెట్లు పెరుగుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ తర్వాత ఆరోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి.

ఈ కింది పనులు చేయడం ద్వారా ఇమ్యూనిటీ పవర్‌ను మీరు పెంపొందించుకోవచ్చు.

బాగా నవ్వడం

రోజులో కొన్ని నిముషాలైనా నవ్వడం ద్వారా మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నవ్వడం వల్ల మీలో ఉత్సాహం పాళ్ళు కూడా పెరుగుతాయి. మీరు బాగా నవ్వాలంటే కామెడీ సీరియల్స్ చూడటమో, సినిమా క్లిప్స్ చూడటమో చేయవచ్చు.

మ్యూజిక్ వినడం

ప్రతి రోజూ కొంతసేపు మ్యూజిక్ వినడం వల్ల మనకు తెలియకుండానే మనం ఉల్లాసంగా ఉంటాము. మ్యూజిక్ వినేటప్పుడూ మన శరీరం ఇమ్యునోగ్లోబున్‌ను విడుదల చేస్తుంది. దీంతో బాడీ బ్యాక్టీరియా మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటూంది.

వ్యాయామం చేయడం

రోజులో అరగంట వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం నుండి చెమట విడుదల అయ్యి అనవసర కొవ్వులు తగ్గుతాయి. అంతేకాక, వ్యాయామం చేయడం వల్ల అలసిపోయి బాగా నిద్రపోతారు దీంతో బాగా నిద్రపట్టి ఒత్తిడికి దూరమౌతుంది.

వ్యాక్సిన్ చేయించుకోవడం

ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కేవలం బేబికి మాత్రమే వ్యాక్సిన్స్ వేస్తే సరిపోదు మీరు కూడా వేయించుకోవాలి. దీంతో మీరు వైరస్‌లపై పోరాడి ఆరోగ్యంగా ఉండగలరు.

సాక్స్ వేసుకోవడం

ప్రసవం జరిగిన తర్వాత శరీరం చల్లగా మారుతుంది కాబట్టి కాళ్ళకు సాక్స్ వేసుకోవడం ద్వారా మీ శరీరంలో వేడీని అలాగే ఉంచవచ్చు దీంతో శ్వాసకు సంబందించి ఎటువంటి ఇబ్బందులూ రావు.

చేతులు కడుగుతూ ఉండండి

మీరు తరచుగా బేబికి డైపర్స్ మారుస్తూ ఉండటం వల్ల మీ చేతుల మీద బ్యాక్టీరియా ఉంటూంది కాబట్టి మీరు డైపర్ మార్చిన ప్రతిసారీ చేతులను శుభ్రంగా కడగండి. దీని వల్ల బ్యాక్టీరియా మీ దరికి చేరదు.

ఆహారం

మనం తినే ఆహారం మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటంటే, పెరుగు, గ్రీన్ టీ, వెల్లుళ్ళి, బ్లాక్ టీ, స్ట్రా బెర్రి వంటివి తినడం వల్ల రోగాల భారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

సోషల్‌గా మూవ్ అవ్వండి

మీకు బాగా నచ్చిన వారితో మాట్లాడటం వల్ల కూడా మనకు  రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి మీరు అందరితో సోషల్‌గా మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సోషల్ మీటీంగ్స్‌కు వెల్తూ మీ అభిరుచిని పెంచుకోండి.

నిద్ర

శరీరానికి పూర్తి స్థాయి నిద్రను ఇవ్వడం వల్ల మనం చాలా రోగాల భారిన పడకుండా కాపాడూకోవచ్చు. రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోండి. అందులోనూ విరామాలు లేని నిద్ర అయితే మరింత మంచిది.

పైవన్నీ పాటీంచడం వల్ల మీరు తొందరలోనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకొని మునుపటిలా తయారవుతారు.

Leave a Reply

%d bloggers like this: