పిల్లలు పుట్టిన తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే..తప్పక తెలుసుకోండి

పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ జీవితంలో చాలా త్యాగం చేయాల్సి వస్తుంది. మీరు తీసుకొనే ప్రతి నిర్ణయం కూడా మీ అందరి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. మీరు మీ కుటుంభం కోసం ఎక్కువ సమయం కేటాయించి రావాల్సి రావచ్చు. కానీ మీకు సమయం సరిపోకపోవచ్చు. భర్యా భర్తల మధ్య సఖ్యత తగ్గవచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత భర్యాభర్తల మధ్య సంతోషం పాళ్ళు తగ్గుతాయని ఒక రీసర్చ్‌లో తేలింది. బేబి హెల్త్ పరంగా,  మీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీకు ఇబ్బందులు రావచ్చు.

మీ టైమ్ అంతా మీ బేబీ కోసమే

సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మగవారు ఎక్కువ ఇబ్బందికి గురౌతారు. బేబీ గురించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సి రావడం వల్ల ఎక్కువ సమయం బేబీతోనే గడుపుతారు. భార్య ఎక్కువ సమయం బేబీతోనే గడపడం వల్ల వారు అసూయకు గురౌతారు. ఇలాంటి సమయాలలో మగవారు ఒంటరితనాన్ని ఫీలవుతారు.

నిద్రకు గుడ్‌బాయ్

పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఎక్కువ సమయం వారి బాగోగులు చూడటానికి సరిపోతుంది. ఇలాంటి సమయాలలో మీరు కొన్ని వాటిని మిస్ అవుతూ ఉంటారు. అవేంటంటే, నిద్ర, ఏకాంతంగా గడిపే సమయం.  పిల్లలు పుట్టి వారు పెరిగే అంతవరకు బార్యాభర్తలు ఏకాంతంగా గడిపే సమయానికి, నిద్రకు దూరం అవ్వాల్సి వస్తుంది.

వాగ్వాదాలు చేసుకోవడం

పిల్లలను పెంచే క్రమంలో మీరు ఒకరితో ఒకరు వాగ్వాదాలు చేసుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే, మీ భర్త ఒకలా పిల్లల్ని పెంచాలని అనుకుంటారు. మీరు ఒకలా పెంచాలని బావిస్తారు. విజాతి భావాల ద్వారా ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావచ్చు.

కలిసి గడిపే సమయం

భార్యాభర్తల మధ్య ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మీరు మిస్ అవుతున్న వాటి కోసం మీరు సమయాన్ని కేటాయించుకోవాలి. ఒకరితో ఒకరు చర్చించుకుంటూ కలిసి నిర్ణయం తీసుకొని జీవితాన్ని సాగించాలి.  ఏదైనా వాగ్వాదం జరిగినా కూడా సర్దుకుపోయే విధంగా ఉంటూ అన్యోన్యంగా ఉండాలి. 

Leave a Reply

%d bloggers like this: