ప్రపంచంలో తల్లితండ్రులు 5 రకాలు : ఇందులో మీరు ఏ రకమో తెలుసుకోండి

ప్రపంచంలో తల్లితండ్రుల వ్యక్తిత్వం 5 రకాలుగా ఉంటుందట. పిల్లల మంచి జీవితం, భవిష్యత్ తల్లితండ్రులపైనే ఆధారపడి ఉంటుందనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఇక్కడ చెప్పుకునే ఈ రకాల తల్లితండ్రుల మీరు ఏ రకమో, మీ పట్ల మీ పిల్లలు ఎలా ఉన్నారో మీరే తెలుసుకోండి.

1.నిరంకుశతత్త్వం

పిల్లలకు ఇటువంటి తల్లితండ్రుల వద్ద సెకండ్ ఛాయిస్ అనేది ఉండదు. తల్లితండ్రులు ఏం చెబితే అది చేయాల్సిందే. ఫలానా టైంకు లేవాలన్నా, ఫలానా టైంకు లేవాలన్నా సరే అన్నీ అనుకున్న సమయానికే జరగాల్సిందే. తల్లితండ్రులకు నచ్చిందే తుది నిర్ణయం. వీళ్లకు తప్పు ఒప్పులు బాగా తెలుసు. ఇలా చేయడం వలన పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎదిగేకొద్దీ ఇబ్బంది పడతారని, అయినా వారికి ఎప్పుడు తమ పేరెంట్స్ చెప్పిన విషయాలు మాత్రం మైండ్ లో  గిర్రున తిరుగుతూ ఉంటాయని అంటున్నారు.

2.పిల్లల వెన్నంటే ఉండేవారు

వీళ్లంటే పిల్లలకు చాలా ఇష్టం. ఉదాహరణకు ఏదైనా పరీక్షలో తమ పిల్లలకు తక్కువ మార్కులు వచ్చాయి అంటే అది చదువు చెప్పిన టీచర్లది తప్పు కానీ మా పిల్లలది కాదు అంటూ ఎప్పుడూ తమ పిల్లల పట్ల రక్షణగా ఉంటారు. అలాగే మా పిల్లలు చాలా అమాయకులు వారికి ఏమీ తెలియదని ఎప్పుడు వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు.

3.డైనమిక్ పేరెంట్స్

ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లాలన్నా, ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలన్నా, సినిమాకు వెళ్లాలన్నా, పార్టీస్ కు వెళ్లాలన్నా..ఇలా ఏదైనా సరే పిల్లలు అడగటమే ఆలస్యం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఈ పేరెంట్స్. వీరంటే పిల్లలకు చాలా ప్రేమ, గౌరవం మరియు ఇష్టం. తల్లితండ్రులంటే స్ట్రిక్ట్ గా ఉండటం కాదు వారి ఆనందాలకు అడ్డుచెప్పకుండా వారికి సంతోషం కలిగించేలా చేయడమే అనుకుంటారు.

4.నటించే తల్లితండ్రులు

ఇక్కడ చెప్పుకునే పేరెంట్స్ సమాజం, గౌరవం, మర్యాద అని ఆలోచించే టైప్. ఉదాహరణకు మీకు ఏదైనా సబ్జెక్టులో ఒకటి 5 మార్కులు తక్కువ వస్తే ఏదో స్టేట్ ర్యాంక్ కోల్పోయారు అనే విధంగా బాధపడుతూ, సినిమాలో ఉండే ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ మీ ఇంట్లో నడుస్తుంది. అంటే పిల్లలపట్ల మరీ ఎక్కువ కేరింగ్ తీసుకోవడమే ఇందుకు కారణం.

5.ఆధునిక తల్లితండ్రులు

వీరికి పిల్లలతో ఎప్పుడు ఎలా ఉండాలో బాగా తెలుసు. ఏదైనా తప్పు చేసినప్పుడు మందలించడం, ఏదైనా బహుమతి గెలుచుకున్నా లేదా ఒక మంచి పనిచేసినప్పుడు మెచ్చుకుని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వీరిపిల్లల భవిష్యత్ పట్ల ఒక గీతను ఏర్పరచుకుని అదే బాటలో వెళ్లేలా ప్రణాళిక రూపొందించుకుంటారు.

ఏది ఎలా ఉన్నా పిల్లల మంచి జీవితమే తల్లితండ్రులు కోరుకునేది. కానీ ప్రవర్తించే విధానం, తీసుకునే నిర్ణయాలలోనే మా పేరెంట్స్ ఇలాంటివాళ్ళు, అలాంటివాళ్ళు ఆనేముద్ర పిల్లల మనసులో గట్టిగా నాటుకుపోయి ఉంటుంది. మరి మీరు ఎటువంటి తల్లితండ్రులో, ఇది చూశాక ఎలాంటి పేరెంట్స్ గా ఉండాలనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మీలో మీ ఆయనకు నచ్చిన 6 విషయాలు…కానీ ఎప్పుడు చెప్పడు

Leave a Reply

%d bloggers like this: