బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తర్వాత వచ్చే 5 మార్పులు

మహిళలు పిల్లలకు పాలు ఇవ్వడం ఆపిన తర్వాత చాలా మార్పులు వస్తాయి.  కొంత మంది మహిళలకు మానసికంగా వస్తే, కొంత మందికి శారీరకంగా వస్తాయి. మహిళలు పాలు ఇవ్వడం ఆపడం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. పాలు ఇవ్వడం ఆపిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయో చాలా మందికి తెలియదు అవేంటంటే,

మూడ్ చేంజ్ అవడం

బ్రెస్ట్ ఫీడింగ్ ఆపడం అంటే మామూలు విషయం కాదు. శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. మీరు మాన్సికంగా చాలా బలహీనంగా అవుతారు.  మీ మూడ్ ఉన్నట్లుండి మారిపోతుంది. అయితే ఇది ఎక్కువ రోజులు ఉండదు. కేవలం కొన్ని వారాలలోనే మాములు స్థితికి వచ్చేస్తారు. అలా రాకపోతే గైనకాలజిస్ట్‌ను కలవండి. శరీరంలో ప్రొలాక్టిన్ నిల్వలు ఉత్పత్తి అయితే మీరెఉ తిరిగి మామూలు అవ్వగలరు.

చాలా సమయం పట్టవచ్చు

కొందరు మహిళలకు చాలా తక్కువ సమయంలోనే పాలు ఆగిపోతాయి కానీ కొందరు మహిళలకు ఎన్నో రోజులైనా కూడా పాలు డ్రై అవ్వవు. దీనికి కారణం వరిలో ఎక్కువ పాలు ఉత్పత్తి అవ్వడమే. ఎక్కువ ఉత్పత్తి అయితే ఎక్కువ రోజులు ఉంటాయి. తక్కువ ఉత్పత్తి అయితే తక్కువ రోజులలో డ్రై అవుతాయి.

ఋతుచక్రం మారవచ్చు

మీరు పాలు సక్రమంగా పట్టిస్తున్నంత మాత్రాన పీరియడ్స్ సక్రమమగా వస్తాయని గ్యారెంటీ లేదు. మీరు పాలు పట్టించడం ఆపిన తర్వాత పీరియడ్స్ మళ్ళీ సక్రమంగా రావడం గమనించవచ్చు. ఇంకో విషయం ఏంటంటేమీరు పాలు పట్టిస్తున్నప్పుడు కూడా మీరు ప్రగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది.

మునుపటి సైజ్‌కు

మీరు పాలు పట్టీంచడం ఆపిన తర్వాత మీ బ్రెస్ట్ తిరిగి మునుపటి సైజ్‌కు వస్తాయి. అక్కడ ఉండే స్థన గ్రంథులు డ్రై అవడం వల్ల అక్కడ కొవ్వు పెరిగి తిరిగి మునుపటి ఆకారంలోకి వస్తాయి. అయితే దీనికి కొన్ని వారాలు సమయం పట్టే అవకాశం ఉంది.

గడ్డ కట్టడం

ఒక్కోసారి స్థన గ్రంథులు లోపల  గడ్డ కట్టే అవకాశం ఉంది. ఇది పాలు పట్టించడం ఆపే సమయంలో జరిగే అవకాశం ఉంది. మీకు బ్రెస్ట్ దగ్గర ఏదైనా ఇబ్బందిగా ఉంటే అక్కడ ఉండే మిల్క్‌ను తీసివేయడం మంచిది. దీని ద్వారా బవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.

Leave a Reply

%d bloggers like this: