భార్య భర్తను ఎలా ఆకర్షించాలో తెలిపే 10 అందమైన చిట్కాలు..

మీరు పెళ్ళి చేసుకున్న మొదట్లో మీ భర్తను ఆకట్టుకోవడం పెద్ద విషయం కాదు. అప్పుడు మీరు ఎంతో క్లోజ్‌గా ఉంటారు.  అయితే కొని సంవత్సరాల తర్వాత కూడా మీ భర్తను ఆకట్టుకోగలగాలి. అప్పుడే మీ బంధం మరింత ఫదిలంగా ఉంటుంది. మీ భర్తను ఆకట్టుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.   అవేంటంటే,

రెడ్ డ్రెస్

రెడ్ డ్రెస్ వేసుకోవడం వల్ల మనిషిలో కోరికలు పెరుగుతాయని కొన్ని సర్వేలలో తేలింది. కాబట్టి మీరు కుడా అప్పుడప్పుడు రెడ్ డ్రెస్ వేసుకోవడం లేదా మీ భర్తకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం ద్వారా వారిని మీ వైపుకు తిప్పుకోవచ్చు.

ఇలా మెసేజ్..

మీరు అప్పుడప్పుడు చిలిపిగా మీ భర్తతో చాట్ చేయండి. అంతేకాక, అతను బాగా ఇష్టపడే భంగిమను లేదా పిక్‌ను పంపండి. ఇలా చేస్తూ మీరు వారిని ఎంత మిస్ అవుతున్నారో, వారు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో తెలియజేయండి.

ఒకరికొకరు

మీరు చేయాల్సిన చిలిపి పనులలో బట్టలు మార్చడం ఒకటి. మీ వారి టై కట్టడం, చొక్కాకు గుండీలు పెట్టడం, బెల్ట్ వేయడం చేయండి. కొన్ని రోజులలో మీరు కూడా అలాంటి అనుభవాన్ని ఫేస్ చేస్తారు.

టీజింగ్

మీ వారిని అప్పుడప్పుడు ఆట పట్టించండి. ఏవైనా నిక్ నేమ్ పెట్టి వారిని ఆట పట్టిస్తే అతని ఏకాగ్రతను మీరు ఈజీగా పొందవచ్చు.

జుట్టు

మీరు స్నానం చేసిన తర్వాత జుట్టును ఆరబెట్టుకొనేటప్పుడు మీ వారి పక్కన కూర్చోని ఆరబెట్టుకోండి. ఇలా చేస్తే వారు మీ జుట్టుతో ఆడటం మొదలుపెడటారు. తర్వాత పనులు అవే జరిగిపోతాయి.

షాపింగ్

మీ భర్తను అప్పుడప్పుడు మీ లోదుస్తుల షాపింగ్‌కు తీసుకెళ్ళండి. దీని వల్ల అతని దృష్టి మారి మీ శరీరం మీద ప్రేమ పుడుతుంది. దీంతో మీరు ఒక్కటవుతారు.

సర్ ప్రైజ్  చేయండి

మీరు అప్పుడప్పుడు అతనికి గిఫ్ట్స్ ఇస్తూ సర్‌ప్రైజ్ చేయడమే కాకుండా మీకు బాగా కనిపించే దుస్తులు వేసుకోండి.  మంచి సాయంత్రం పూట టైట్ షర్ట్ వేసుకొని వారిని ఇంప్రెస్ చేయడం వంటివి చేయండి.

మిమ్మల్ని మీరే

మీ ఇంట్లో కేవలం మీరు, మీభర్త ఉన్నప్పుడు కొన్ని చిలిపి పనులు చేయండి. ఇలా చేయడం ద్వారా మీభర్త మీ దగ్గరికి వచ్చేస్తారు. అయితే వారికి నిదానంగా సరెండర్ అయితే ఆ అనుబూతి వేరుగా ఉండే అవకాశం ఉంది.

మీకు ఏమి కావాలో చెప్పండి

మీ శరీరానికి సంబంధించి మీకు ఏమి కావాలో చెప్పండి. మీ భర్త చెయ్యిని సుతారంగా తీసుకొని మీ శరీరంలో మీకు నచ్చిన చోట పెట్టండి. ఇలా మీకు ఏమి కావాలో, ఎలా కావాలో అతనికి అర్థం అయ్యేలా చెప్పండి. ఇలా చేస్తే ఏ భర్తా ఆ అవకాశాన్ని వదులుకోరు.

అడగడం

ఆడవారికి ఎలా ఉంటాయో మగవారికి కూడా అలాంటి కోరికలే ఉంటాయి. కాబట్టీ మీరు మీ భర్తతో మాట్లాడేటప్పుడు హస్కీగా మాట్లాడటం,  ఏదైనా సంకేతం ఇవ్వడం వంటివి చేయండి. అంతేకాక, మీ భర్త ఆఫీస్‌లో ఫోన్ చేసి ‘మీరు కావాలి’ అనే అర్థం వచ్చేలా మాట్లాడండి.

Leave a Reply

%d bloggers like this: