మహిళల మెడ, చంకలపై ఉన్న నలుపును 10 నిముషాలలో తగ్గించే 3 సౌందర్య చిట్కాలు

ఎంత అందంగా ఉన్నాసరే చాలామంది మెడపై నలుపుదనంతో పదిమందిలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మెడపై నలుపుదనం  కారణంగా వారి  అందాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకునే గృహ చిట్కాలను పాటించడం వలన మెడపై నలుపుదనం తగ్గి ఆకర్షణీయమైన, అందమైన మెడ  మీ సొంతం అవుతుంది.

నిమ్మరసం, తేనె

మెడపై నలుపుదనంతో ఇబ్బందిపడే వారు ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసుకుని ప్రతిరోజూ మెడపై అప్లై చేసుకుని 20 నిముషాల తర్వాత  క్లీన్ చేసుకుంటే మెడపై నలుపుదనం తగ్గుతుంది.

బంగాళాదుంప

బంగాళాదుంపను బాగా ఉడికించి పొట్టుతీయకుండా గుజ్జుగా చేసుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల పాలు, కొద్దిగా కొబ్బరినూనె కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడపై రాసుకుని బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అరటిపండు ఆలివ్ ఆయిల్

ఒక అరటిపండును తీసుకుని మెత్తని గుజ్జుగా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మెడ చుట్టూ రాసుకుని మసాజ్ గా చేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే మెడపై నలుపుదనం తగ్గుతుంది.

ఆలివ్ ఆయిల్ బేకింగ్ సోడా

2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్లు ఉప్పు ఒక గిన్నెలోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లని మెడపై రాసుకుని 15 నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగివేసుకోవడం వలన మెడ అందంగా మారుతుంది.

కీరదోస

కీరదోస ముక్కను తీసుకుని కొన్ని రోజుల పాటు మెడ భాగంపై మర్దనా చేసినా కానీ కీరదోస ముక్కలో కొద్దిగా నిమ్మరసం కలిపి మెడపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కేవలం ఈ మిశ్రమాలను ఒక్క మెడ భాగంలో మాత్రమే కాకుండా నలుపుగా ఉన్న మోచేతులు, మోకాళ్ళు, చంకల భాగంలో కూడా రాసుకోవచ్చు. మీకు తెలిసిన హోమ్ రెమెడీస్ ను COMMENT రూపంలో మాతో పంచుకోవచ్చు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.  

పిల్లల కళ్ళకు కాటుక పెట్టవచ్చా..? అసలు నిజం ఏంటో తెలుసుకోండి.

Leave a Reply

%d bloggers like this: