మహిళ శరీరం, పురుషులకన్నా చాలా ప్రత్యేకమైనది. శరీర అవసరాలు, క్రియలు వయసును బట్టి సమయాన్ని బట్టి. తరచుగా మారుతూ ఉంటాయి. కొన్ని విషయాలు ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అన్నది మహిళలు కూడా తెలియకపోవచ్చు. కానీ మీ శరీరం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం…అలంటి కూని విషయాలు ఇక్కడ చూడండి.
1. మీ బ్రా ఫిట్, మీ రుతుక్రమ దశ ఆధారంగా మారుతూ ఉంటుంది. రొమ్ములు చిన్నవి, పెదవి అవుతూవుంటాయి.
2.చక్కర పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వలన, యోని ప్రాంతంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. పెరుగు తినడం వలన ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంది.
3.ఎక్కువగా నీరు తీసుకోవడం వలన యోని ఎప్పుడు లూబ్రికేటెడ్ గా ఉంటుంది. ఎలాంటి దుర్వాసన రాదు.
4.కొంత మంది మహిళలు తమలో జరిగే అండ విడుదలను, ఫీల్ అవ్వగలరు. ఆ సమయంలో పోతి కడుపు ఒక పక్క నొప్పిగా ఉంటుంది. దీనిని మిడిల్ పెయిన్ అంటారు.
5.కాళ్ళకి హై హీల్స్ వాడడం వలన, కాళి వేళ్ళు వంకరపోతాయి. కనుక హై హీల్స్ ఎక్కువగా వాడకపోవడం మంచిది.
6.ఆడవారు పుట్టేటప్పుడు పదిలక్షల పరిపక్వత చెందని అండాలు కలిగివుంటారు. జీవితకాలం లో కేవలం 300-500 అండాలు మాత్రమే పరిపక్వత చెందుతాయి.