మీ పిల్లలకు దగ్గరవ్యడానికి తల్లిగా మీరు చేయాల్సిన 5 పనులు

పిల్లలు పుట్టడం అనేది ఒక ఎత్తు అయితే వారితో మంచి సంబంధాన్ని కొనసాగించడం ఒక కళ. కొంత మంది తల్లులు పిల్లలు కడుపులో ఉండగానే వారి బిడ్డతో ఒక రిలేషన్ ఏర్పరుచుకొని ఉంటారు కొంతమంది వారు బయటకు వచ్చిన తర్వాత ఏర్పరుచుకుంటారు. కానీ 20 శాతం మంది తల్లులు రిలేషన్ ఏర్పాటు  చేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడాతారు. వారి కోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే,

1.మీ స్కిన్ కలవడం

మీ బేబీ చర్మం, మీ చర్మం ఒకదానికొకటి తాకినప్పుడు మీ ఇద్దరి మధ్యా బంధం ఏర్పడుతుంది. మీరు మీ బేబిని వీలు చిక్కినప్పుడల్లా హత్తుకోండి. వారితో ఆడుకొనేటప్పుడు వారిని తాకుతూనే ఉండండి. ఇలా చేయడం ద్వారా మీకు తెలియకుండానే మీ మధ్య బంధం ఏర్పడుతుంది.

2.పాప/బాబు గురించి పూర్తిగా తెలుసుకోండి

మీ పాప/బాబు గురించి పూర్తిగా తెల్సుకోండి. మీరు ఏ పనిలో ఉన్నా ఓకన్ను మీ పాప మీద ఉంచండి. వారి ముఖ కవలికలను పూర్తిగా చదవండి దీని ద్వారా మీ బాబుకు ఏమి కావాలో మీకు అర్థమయిపోతుంది. వారి ఏడుస్తుంటే, ఆకలి కోసం ఏడుస్తున్నారో లేదా వేరే దాని కోసం ఏడుస్తున్నారో తెలుస్తుంది.

3.మాట్లాడుతూనే ఉండండి

మీరు మీ పిల్లలతో మాట్లాడుతూనే ఉండటం వల్ల మీ మధ్య రిలేషన్ చాలా బలంగా మారుతుంది. మీరు మాట్లాడే మాటలు బేబికి అర్థం కాకపోయినా, ఏదో ఒకటి మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీ బేబి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ ముఖకవలికలను బట్టి వారి స్పందన ఉంటుంది. దీంతో మీ బంధం మరింత దగ్గర అవుతుంది.

4.జోల పాడటం

మీ పిల్లలను నిద్రపుచ్చేటప్పుడు జోల పాడుతూ ఉంటారు. అయితే మిగిలిన సమయంలో కూడా మీరు ఏవైనా పాటలు పాడటం వల్ల వారు  చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. కాబట్టి మీరు వీలైనంత ఎక్కువగా వారి దగ్గర పాడండి. దీంతో మీ ఇద్దరి మధ్యా మరింత చనువు ఏర్పడుతుంది.

5.వారి కోసం ప్రత్యేకంగా చేయండి

వారి కోసం మీరు ఏదైనా ప్రత్యేకంగా చేయండి. ఏదైన ప్రత్యేక శైలిలో హగ్ చేసుకోవడం, కొత్తగా మాట్లాడటం వంటివి చేయడం వల్ల అలా చేస్తున్నది మీరే అన్నది వారు గుర్తిస్తారు. ఆకలి కోసం, తాగడం కోసం మీరు వారికి కొన్ని సంకేతాలు నేర్పించండి. దీని వల్ల మీ మధ్య బంధం మరింత గట్టిగా తయారవుతుంది.

6.మసాజ్ చేయడం

మీ బేబీ శరీరాన్ని అప్పుడప్పుడు మసాజ్ చేయండి. దీని వల్ల మీ స్పర్శ మీ బేబీకీ తగులుతుంది దీని వల్ల వారు మిమ్మల్ని ఎప్పుడైనా గుర్తు పడతారు. ఇలా మసాజ్ చేయడం వల్ల వారి శరీరంలోని ఒత్తిడి దూరమై ఉల్లాసంగా ఉంటారు.

7.మీ దగ్గరే ఎప్పుడూ

మీ పాప/బాబు ఊయల ఎప్పుడు కూడా మీకు దగ్గరగా ఉండేలా చూసుకోండి. బేబి ఆడుకొనేటప్పుడు కూడా మీరు పక్కనే ఉండెల చూసుకోండి. ఇలా చేయడం ద్వారా నేqను సురక్షితం అనే భావన మీ బేబీలో ఏర్పడుతుంది. ఈ భావన రావడం వల్ల మీ బంధం మరింత బాగుంటుంది.

ఇవన్నీ చేయడం ద్వారా మీ పాపకు మీకు మధ్య చాలా మంచి బంధం ఏర్పడుతుంది. అప్పటికీ మీ ఇద్దరి మధ్య అటాచ్‌మెంట్ లేకపోతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

Leave a Reply

%d bloggers like this: