మీ పిల్లలను జీనియస్ గా తయారుచేయడానికి కొన్ని సులభమైన ఉపాయాలు!!

చదివిన విషయాలను మర్చిపోవడం, పేర్లు గుర్తుపెట్టుకోలేకపోవడం, మందమతి ఎక్కువగా ఉండటం అనేది వయస్సు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తిలో మార్పు వస్తూ ఉంటుంది. తీసుకునే ఆహారంలో మెగ్నీషియం సమపాళ్ళలో లేకపోవడమే ఇందుకు కారణం. పిల్లలలో జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయాలో సింపుల్ గా ఇక్కడ చెప్పడం జరిగింది.

విటమిన్ డి ఫుడ్స్

జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ డి బాగా ఉపయోగపడుతుంది. అందుకే నట్స్, బాదం, పిస్తా, ఆక్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన  జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదపడతాయి.

ఎగ్

Image result for EGG

ప్రతి రోజూ పిల్లలకు ఒక గుడ్డు ఇవ్వడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తిని పెంచే ప్రోటీన్ ఇందులో ఉండటం వలనే పిల్లలకు రోజూ గుడ్డు ఇవ్వాలని చెప్పడానికి అసలు కారణం.

భయం, ఒత్తిడి

Image result for INTELLIGENT KIDS

పరీక్షలు సమీపిస్తున్నప్పుడు పిల్లలలో భయం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లితండ్రులు పిల్లలకు పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టాలి. అందుకని కొవ్వు ఆహార పదార్థాలను తగ్గించి విటమిన్ బి 12, విటమిన్ బి6, విటమిన్ సి, ఇ, కాల్షియం, మెగ్నీషియం ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి.

గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్

Image result for INTELLIGENT KIDS

పిల్లలు ఏ విషయాన్నైనా త్వరగా మర్చిపోతుంటే వారి ముందు ఎక్కువ బొమ్మలను లేదా వారికి ఇష్టమైన వస్తువులను ఉంచి అన్ని పేర్లు చెప్పాలి. ఒక 5 నిముషాల తర్వాత మళ్ళీ వాటి పేర్లు ఏంటని ఒక్కొక్కటి చూపిస్తూ అడగాలి. ఇలా చేయడం వలన ఎక్కువకాలం వారు అన్ని విషయాలను గుర్తుపెట్టుకోగలరు. మెదడుకు బాగా ఉపయోగపడుతుంది.

పెయింటింగ్

Image result for INTELLIGENT KIDS painting

పిల్లలకు చెప్పిన విషయాలు మర్చిపోతున్నారు అంటే వారికి బొమ్మల ద్వారా, వీడియో గేమ్స్ ద్వారా జ్ఞాపకశక్తి పెంచే టిప్స్ పాటించాలి. అందుకని పేపర్ పై పెయింటింగ్స్ వేయించడం, మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ పెయింటింగ్ ను వేయమనటం చెప్పాలి. వీడియో గేమ్స్ వంటి ఆటలంటే ఇష్టం కాబట్టి అందులోని క్యారెక్టర్స్ పేరు వారు ఏం చేస్తారో అడుగుతూ ఉండాలి.

రైమ్స్, స్టోరీస్

Image result for INTELLIGENT KIDS

ఇప్పుడు చాలా వరకు పిల్లలు రైమ్స్ అంటే బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి రైమ్స్ వీడియోస్ చూపించడం చేయాలి. అలాగే పెద్దలు ఇంట్లో ఉంటే వారికి కథలు చెప్పించాలి. మళ్ళీ ఎప్పుడైనా మీరు పాడుతూ ఆ రైమ్స్ పాడమనటం, కథలు చెప్పమనటం కానీ వారు చదువుకునే బుక్స్ లో స్టోరీస్ చెప్పమనటం చేయాలి.

తేనె

Image result for honey

ప్రతిరోజూ ఒక స్పూన్ తేనే పిల్లలకు తినిపించడం వలన పిల్లల్లో యాంగ్జైటీ తగ్గి జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది.

పాలకూర

Image result for spinach

జ్ఞాపకశక్తి పెంచే ఉత్తమమైన ఆహారపదార్థాలలో పాలకూర ఒకటిగా చెప్పవచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ బి6 మెదడును చురుకుగా ఉంచేలా చేస్తాయి.

పిల్లలకు ఇంకా ఈ విధంగా చేయడం వలన జ్ఞాపకశక్తిని పెంచవచ్చు  అని మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే మాకు COMMENT చేయవచ్చు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

మంచి తండ్రి అవ్వడానికి మీ భర్తకు ఉండాల్సిన 6 లక్షణాలు

Leave a Reply

%d bloggers like this: