మీ పిల్లల కళ్ళకు కాటుక పెడుతున్నారా..! ఒక్కసారి ఇక్కడ ఏం జరిగిందో చూడండి

పుట్టిన పిల్లలకు కాటుక పెట్టవచ్చా? పెట్టకూడదా? అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. అయితే కొన్ని వేల సంవత్సరాల నుండి మన పెద్దలు  ఇది ఫాలో అవుతుండటం వలన మనం కూడా ఫాలో అవుతున్నాం కానీ అప్పుడే పుట్టిన పిల్లలకు, నెలల పిల్లలకు కాటుక పెట్టడం అంత సేఫ్ కాదు.  ఎందుకో తెలుసుకోండి. 

కాటుక కళ్ళకు పెట్టడం వలన

పసిపిల్లలకు కాటుక పెట్టడం వలన కళ్ళు ప్రకాశవంతంగా, అందంగా ఉంటాయి, కళ్ళలోకి దుమ్ము , ధూళి చేరవు అనేది నిజమే కానీ పిల్లలకు కాటుక పెట్టడం వలన కళ్ళ నుండి నీరు కావడం, కళ్ళు మంటగా ఉండటం, బ్రెయిన్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, అనీమియా సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.

పిల్లలకు కాటుక పెట్టాలనుకుంటే

పిల్లలకు పెట్టడం వలన దిష్టి తగలదని మన నమ్మకం. అందుకని తలనుదురు భాగంలో వెంట్రుకలకు దగ్గరగా, చెంపలపై, కాలి పాదం కింద, చేతి మణికట్టు వద్ద పెట్టుకోవడం చేయాలి. కళ్ళకు పెట్టడం వలన మంటగా ఉంటుంది మరియు ఒక్కోసారి కళ్ళను పిల్లలు రుద్దుకున్నప్పుడు లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.

కాటుక వలన లాభాలు

పసిపిల్లలకు కాటుక వద్దు కానీ మహిళలు కాటుక పెట్టుకోవడం వలన కళ్ళకు చల్లగా ఉంటుంది ప్రకాశవంతంగా ఉంటాయి. దుమ్ము ధూళి చేరదు. సూర్యకిరణాల నుండి కంటిని కాపాడుతుంది. కాటుక పెట్టుకోవడం వలన కంట్లో ఉండే ఎర్రని చారలు తొలగిపోతాయి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

ఈ 6 పిల్లల ప్రాడక్ట్స్ అస్సలు వాడకండి. చాలా ప్రమాదకరం

Cover Image Source : lifealth.com

Leave a Reply

%d bloggers like this: