మీ భర్త గొప్ప తండ్రి అని చెప్పే 10 లక్షణాలు ఇవే, మరి మీ ఆయనగరిలో ఈ లక్షణాలు ఉన్నాయా..!!

ప్రతి తల్లికి ఉన్నట్లే ప్రతి నాన్నకు కూడా తన బేబీ మీద చాలా ప్రేమ ఉంటుంది. అయితే చాలా మంది తండ్రులకు  అది ఎలా బయట పెట్టాలో తెలీయదు. అయితే మీకన్నా మీ భర్తకే పిల్లల విషయంలో ఓపిక ఎక్కువ ఉంటుందని మీకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అలాంటీ సంధర్భాలు ఏవంటే,

డెలివరీ సమయంలో

చాలా మంది భర్తలు ప్రసవ సమయంలో వారికి ఎన్ని పనులు కూడా మీ దగ్గరే ఉండటం, మీకు ధైర్యం చెప్పడం వంటివి చేస్తూ ఉంటారు ఇలా చేసే తండ్రులు భవిష్యత్తులో ఎక్కువ ఓపిక ఉన్న తండ్రుల్లా మారే అవకాశాలు ఎక్కువ. ఇలా చేస్తే మీకు ధైర్యంగా ఉండి చివరి వరకు కూడా మీ భర్త మీకు తోడుగా ఉంటారనే నమ్మకం వస్తుంది.

మిమ్మల్ని నిద్రపోమని చెప్పడం

మీరు ప్రసవ సమయంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటారు. ఎన్నో కష్టాలు పడిన తర్వాత మీరు జన్మనివ్వడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియను అంతటినీ అర్థం చేసుకొనే మీ భర్త నేను పాప బాగోగులు చూసుకుంటా నువ్వు రెస్ట్ తీసుకో అని అంటారు. అలాంటి భర్త మీకు దొరికినట్లైతే మీరు చాలా అదృష్టవంతులు.

వ్యక్తిగత అవసరాలకు దూరంగా ఉండటం

వ్యక్తిగత అవసరాలకు దూరం ఉండటం అనేది మగవారికి చాలా కష్టం. పిల్లలు పుట్టిన తర్వాత చాలా సమయాన్ని వారి కోసమే గడపాల్సి ఉంటుంది. ముందు రోజుల్లో వారు సినిమాకు వెళ్ళడం, బయటకు వెళ్లడం వంటి పనులు చేసి ఉంటారు కానీ ఇప్పుడు వాటి కోసం కాకుండా పిల్లల కోసమే ఆయన పరితపించి పోతుంటే,  వారు చాలా త్యాగం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి.

గేమ్స్  త్యాగం చేయడం

చాలా మంది మగవారికి గేమ్స్ ఆడటం హాబీగా ఉంటుంది అయితే పిల్లల కోసం వారి ఇష్టాన్ని త్యాగం చేస్తుంటే వారు చాలా మంచి తండ్రి అని చెప్పవచ్చు.

మీ పనులు చేయడం

మీరు ఇన్ని రోజులూ పడిన బాధలను మా భర్త అర్థం చేసుకుంటారు. మీ ఇంటి పనులలో మీకు సహాయం చేయడం లేదా పూర్తి బాధ్యత తనే తీసుకోవడం వంటివి జరుగుతాయి. ఇలా చేస్తూ ఉంటే అతను మంచి భర్త అని చెప్పవచ్చు.

ఆఫీస్ పనిని మేనేజ్ చేయడం

మీ భర్త బేబిని ఒక చేతిలో, వర్క్‌కు సంబంధించి ఫోన్ ఒక చేతిలో పట్టుకుంటే మీకు చాలా ఆనందం వేస్తుంది. వర్క్ కన్నా బేబీనే ముఖ్యం అనే భావన ఆయన మీలో కలిగిస్తారు.

ఆయన బట్టలను గలీజు చేస్తే

మీ భర్త మీద సరిగ్గా ఆఫిస్‌కు వెళ్ళేటప్పుడు బేబి పాస్ పోయడం, విసర్జన చేయడం చేస్తే మీ భర్త అస్సలు విసుక్కోకుండా వేరే బట్టలు మార్చుకొని వెల్తే అతను చాలా మంచి తండ్రి అని అర్థం. అతనికి లోపల బేబీ మీద చాలా ప్రేమ ఉందని అర్థం.

డ్యాడీ అనే పిలుపు కోసం

డ్యాడీ అనే పిలుపు ప్రతి నాన్నకూ ప్రత్యేకమైనది. ఆ పిలుపు కోసం ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తాడు. వారు పిల్లల చేత డ్యాడీ అనే పదాన్ని పలికించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీన్ని బట్టి ఆయనకు పిల్లల మీద చాలా ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి.

వారు నిద్రపోతున్నప్పుడు రాత్రంతా మేల్కొని ఉండటం

బేబీ నిద్ర పోతున్నప్పుడు కొందరు నాన్నలు అలానే చూస్తుండీ పోతారు. ఒక్కోసారి రాత్రి మొత్తం పాప/బాబును గమనిస్తూనే ఉంటారు. దీనిని బట్టి ఆయనకు గుండె లోతుల్లో పిల్లల మీద చాలా ప్రేమ ఉందని అర్థం.

స్మోకింగ్ ఆపడం

చాలా మంది నాన్నలు స్మోకింగ్ అలవాటును భార్యల కోసం ఆపరు కానీ పిల్లల కోసం ఆపుతారు. పిల్లల కోసం స్మోక్ చేయకండి అని అడిగితే ఆ దరిదాపుల్లో నాన్నలు స్మోక్ చేయరు. అందుకంటే బేబీ మీద వారికి ఎనలేని ప్రేమ ఉంటుంది కాబట్టి.

మీకు కూడా ఇలాంటి భర్త ఉంటే అతను భవిష్యత్తులో చాలా మంచి తండ్రి అవుతాడని చెప్పవచ్చు.

Leave a Reply

%d bloggers like this: