శ్రీమంతంలో గాజులు ఎందుకు ధరిస్తారో ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాలి..!

మహిళల అలంకరణలో తిలకం, ఆభరణాలు, గాజులు, చెవి రింగులు ఉండటం మనకు తెలిసిందే. పిల్లలు పుట్టినప్పుడు నల్లటి గాజులను  ఎందుకు వేస్తారో తెలుసుకదా.. పిల్లలకు దిష్టి తగలకుండా ఉండటానికి ఈ విధంగా వేస్తారు. ఇక ఆడవాళ్లకు ఒక వయసు వచ్చాక మెడలో గొలుసు, గాజులు తప్పకుండా వేసుకోవాలని చెబుతున్నారు మన పెద్దలు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలావరకు ఇలా ఎవరు చేయడం లేదనే చెప్పాలి. అలాగే తప్పకుండా పాటించేవారు ఉన్నారు కాబట్టి అందరినీ  ఉద్దేశించినది మాత్రం కాదు.

అయితే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వారి ఆనందంకోసం, భర్త, మహిళల సమక్షంలో జరిగే గొప్ప ఫంక్షన్ గా శ్రీమంతంను  చెప్పుకోవచ్చు. శ్రీమంతంలో గర్భిణీగా ఉన్న మహిళకు పసుపు రాసి, మట్టి గాజులను వేస్తుంటారు. ఇలా చేయడం వెనుక అసలు రీజన్ ఏంటో తెలుసా..? సాధారణంగా కడుపులో ఉన్న శిశువుకి ఐదవ నెలలో ప్రాణం వస్తుంది మరియు సున్నితంగా ఉంటుంది. అందుకని ఆ శిశువుని ఎంత సున్నితంగా జాగ్రత్తగా చూసుకోవాలో గాజుల రూపంలో తెలుపుతున్నారు. అలాగే మోచేతికి మరియు మణికట్టు మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానం అయి ఉంటాయి. స్వల్ప ఒత్తిడి గాజుల ద్వారా కలుగజేయడం వలన గర్భాశయంలోని నాడులు అందుకు అనుగుణంగా ఉత్తేజితం అయి, గర్భంలోని కండరాలు సరిగ్గా పనిచేయడానికి దోహదపడతాయని వైద్యులు సైతం అంటున్నారు. అలాగే గర్భానికి దగ్గరగా గాజులు ధరించిన చేతులు ఉండటం వలన గాజుల చేసే సవ్వడి వలన శిశువుకి వినికిడి శక్తి పెరగడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. మన పెద్దలు ఈ ఫంక్షన్ జరపడం వెనుక అసలు రీజన్ ఇది. మన సాంప్రదాయాలలో ప్రతి ఒక్కదానికి ఏదో ఒక ముఖ్యమైన ఉపయోగకరమైన విషయం ఉండకనే ఉంది. గర్భంతో ఉన్న మహిళకు శ్రీమంతం జరపడం వలన ఆ ఇంటికి, పుట్టబోయే బిడ్డకు అంతా మంచి జరుగుతుంది అని కూడా అంటారు.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు. 

Leave a Reply

%d bloggers like this: