సంవత్సరం లోపు మీ పిల్లలలో జరిగే ఈ మానసిక మార్పులను ప్రతి తల్లి తప్పక గమనించాలి

బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత తల్లితండ్రులకు ఎంత సంతోషం కలుగుతుందో బిడ్డ ఎదుగుతున్నప్పుడు కూడా అంతే ఆనందం, సంతోషం కలుగుతుంది. తమకళ్ళ ముందు తమ బిడ్డ ఎదుగుతూ ఉంటే ఆ ఆనందాన్ని తల్లితండ్రులు మాటల్లో వర్ణించలేరు. అయితే మొదటి ఆరు నెలలలో బిడ్డ మానసిక పరిస్థితి, మనోవికాసం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

బిడ్డ మానసిక ఎదుగుదల, వయసు పెరిగేకొద్దీ పిల్లలబుద్ధి ఎలా ఉంటుంది, వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయ్ అనేది పసిపిల్లల నుండి ఎదుగుతున్న సమయమే వారికి చాలా ముఖ్యమైనది. ఈ వయసులోనే పిల్లల శరీరంలో భౌతిక మార్పులు, మెదడు పనితీరు, తలలో జరిగే చిన్న చిన్న మార్పులే బిడ్డ వయసుపెరిగే  కొద్దీ ఈ విషయాలు అన్నీ తెలుస్తాయి. అటువంటి మార్పులు ముఖ్యంగా మొదటి ఆరు నెలలోనే జరుగుతాయి.

మొదటి ఆరు నెలలలో తన చుట్టూ ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలన్న ఉత్సాహం పిల్లలకు కలుగుతుంది. తమ చుట్టూ జరిగే విషయాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఈ ఆరు నెలలలోనే మెదడు పనితీరు చాలా వేగంగా జరుగుతుంటుంది.

మొదటి 2 నెలలు

మొదటి ఆరు నెలలలో పిల్లలలో ఎటువంటి మార్పులు జరుగుతాయంటే 1 మరియు 2 నెలలలో తమ చుట్టూ జరిగే విషయాలు, పర్యావరణం గురించి తెలుసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తల్లి స్పర్శ, తల్లి మాటలు, నవ్వు, వాసన, బాధ అన్ని విషయాలను తెలుసుకోగలరు. ఆ తర్వాత ఇతరుల మాటలు, నవ్వును సులభంగా తెలుసుకోగలరు. పిల్లలను ఇది ఏంటి? అది ఏంటి? అని అడిగినప్పుడు తల ఆడిస్తూ ఉంటారు. ఇంకా రాని మాటలతో ఏదో చెప్పాలని చూస్తుంటారు. అలాగే ఈ రెండు నెలలలోనే రంగులు గుర్తించడం, వస్తువులను కనిపెట్టడం చేయగలరు. తరచూ వారికి కనిపించని వస్తువు కనిపించకపోతే ఆ వస్తువు కోసం వెతకడం మొదలు పెట్టడం చేస్తుంటారు.

3 వ నెలలో

మొదటి రెండు నెలలలో తల్లి స్పర్శలు, చుట్టూ జరుగుతున్న విషయాల గురించి తెలుసుకున్న తర్వాత మూడవ నెల నుండి చేతులకు, కాళ్లకు ఉత్సాహం వస్తుంది. కాళ్ళను పైకి ఎత్తడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే ముందు రెండు నెలలలో చేయలేని పనులను ఈ నెల నుండి మొదలుపెడతారు.

4 వ నెలలో

మొదటి రెండు నెలలలో తమ చుట్టూ జరిగే విషయాలు తెలుసుకున్న తర్వాత 4 వ నెల నుండి తమ చుట్టూ ఉన్న వస్తువులను బాగా గుర్తించడం చేస్తారు. ఆ వస్తువులతో ఆదుకోవడం, ఆ వస్తువులు ఎలా పనిచేస్తాయని తెలియకపోయినా తమకు నచ్చిన విధంగా, ఇష్టం వచ్చినట్లుగా చేయడం, అలాగే ఆ వస్తువులను నోట్లో పెట్టుకోవడం చేస్తారు. ఇక తమ శరీరంలో ఉన్న చేతులు, కాళ్ళు, చెవులు, ముక్కు..ఇలా ఒక్కో భాగం గురించి వారికి అవగాహన వస్తుంది. ప్రతి ఒక్క విషయం గురించి మరీ క్షుణ్ణంగా కాకపోయినా కొంతవరకు తెలుసుకోగలరు.

6 వ నెలలో

పిల్లలు త్వరగా మాట్లాడితే చూడాలని ప్రతి తల్లితండ్రులు కోరుకుంటూ ఉంటారు.  అయితే పిల్లలు మాట్లాడటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి నోరు తెరచి ఇది, అది అని చెప్పలేకపోయినా మీరు చెప్పే మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి దానికి వారికి వచ్చిన మాటలతో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేయగలరు.  నోటి నుండి సరైన విధంగా త్వరగా మాటరాకపోయినా ఏదైనా వస్తువును బాగా చూపించగలరు మరియు అర్థం చేసుకోగల ఎదుగదల   అలవడుతుంది.

పిల్లలు మానసికంగా ఎదగడం అనేది సాధారణ విషయమే అయినా కొందరు పిల్లలలో మానసిక ఎదుగుగల అనేది సరిగ్గా ఉండదు. అందుకే తల్లితండ్రులు కూడా పిల్లలు మానసికంగా ఎదగాలంటే వారు కూడా ప్రతి విషయం గురించి చెప్పడం, వస్తువులను చూపించడం వలన సులభంగా తెలుసుకోగలరు. 

Leave a Reply

%d bloggers like this: