ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో కలిసి తీసుకునే పెద్ద నిర్ణయం… పెళ్ళి. కొత్త జీవితానికి నాందిగా, తమ కలలను నిజం చేసుకోడానికి ఇద్దరు కలిసి వేసే అడుగులకు ప్రారంభం. అయితే ఆ అడుగులన్నీ సరైన దిశలోనే వెళ్తాయా, వేసే తప్పటడుగులు ఎలా సరి చేసుకోవాలి , ఇవన్నీ కొత్త దంపతులను కలవరపెట్టే విషయాలే. ఎంతైనా కొత్త కాపురానికి కొన్ని సలహాలు అందరి ఇస్తారు. కానీ వాటిలో మీకు తప్పకుండా అవసరమయ్యేవి, ముఖ్యమైనవి ఏంటో ఇక్కడ చూడండి…
1. ప్రేమ మాటల్లో కాదు, చేతల్లో చూపించండి….

Image Credits: Stories
“ఐ లవ్ యూ “ అని రోజుకు పదిసార్లు చెప్పినంత మాత్రాన మీ భాగస్వామిని మీరు ప్రేమిస్తున్నట్టు కాదు. ప్రేమ మనం చేసే పనుల ద్వారా తెలియాలి. మీ భాగస్వామిని అన్ని విషయాలలో అర్ధం చేసుకుని నడుచుకోవడమే ప్రేమ.
2. వాదించండి… కానీ..

భార్య భర్తల మధ్య గొడవలు చాలా సహజం. కొత్త దంపతులు కాదు, గొడవలు జరిగినప్పుడు వాదనలు తప్పవు. కానీ వాదన మీ ఇద్దరి మధ్య కాదు, గొడవకు మీ ఇద్దరికి. ఆ వాదన గొడవ పరిష్కారానికి దారి తీయలే తప్ప మీ ఇద్దరి మధ్య గొడవను పెంచకూడదు.
3. మెచ్చుకో

Image Credits: Stories
ఇది కొత్త దంపతుల మధ్య సహజంగానే ఉంటుంది. కొత్త కాపురంలో మన భాగస్వామి చేసే ప్రతి పని అద్భుతంగానే ఉంటుంది. అన్నిటికి మెచ్చుకుంటాం. కానీ రోజులు గడిచే కొద్ది ఆ మెచ్చుకోవడాలు తగ్గిపోతాయి. అలా జరిగనివ్వకండి. మీ భాగస్వామి మీ పై ప్రేమను చూపించడానికి చేసే పనులను ఏదో ఒక రూపం లో మెచ్చుకోండి.
4. ఏకాంతంగా గడపటం

ఇద్దరూ ఒక్కటవ్వటంయాంత్రికంగానో, కోరికను మాత్రమే తీర్చేదిగా ఉండకూడదు. మీ మధ్య ప్రేమను మరింత పెంచాలి. శరీరాలు మాత్రమే కాదు మనసు కూడా ఐక్యం కావాలి. కొత్త దంపతులుగా ఏకాంతాన్ని సంతోషంగా ప్రేమతో ఆనందించండి.
5. పొదుపు

కొత్త కాపురం మొదలుపెట్టాక, అన్ని అవసరాలకు డబ్బు చాలా అవసరం. అందుకే దుబారా ఖర్చులు తగ్గించుకుని, ఇద్దరికి అవసరమైన వాటి మీదే ఖర్చుపెట్టాలి. పొదుపు అలవాటు చేసుకోండి, ఆ బాధ్యత ఇద్దరు తీసుకోండి.
మీకు తెలిసిన కొత్త దంపతులందరికి తప్పకుండా SHARE చేయండి….